మల్కాజిగిరి లోకసభ నుండి జెపి: రేవంత్ రెడ్డికి రివర్స్!

అయితే మొదటిసారి రేవంత్ వ్యాఖ్యలు ఆయనకే ఎదురుకొట్టే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఈసారి రంగారెడ్డి జిల్లాలోని మల్కాజిగిరి లోకసభ సీటు ఆశిస్తున్నారు.
పార్టీలోనే ఇతర నాయకుల పోటీకి తోడు ఈసారి ఇదే సీటు నుంచి పొత్తులో భాగంగా పోటీ చేస్తానని జెపి పదేపదే చేస్తున్న ప్రకటనలు రేవంత్‌కు ఇబ్బందిగా మారాయి. ముందు జెపిని అక్కడ పోటీ నుంచి తప్పించాలని అనుకొన్న ఆయన శనివారం ఇక్కడ పరోక్షంగా ఆ దిశగా వాగ్బాణాలు వదిలారు.
కాని ఆ వ్యాఖ్యలకు వేరే కోణంలో ప్రతిస్పందన వచ్చింది. లక్షల సంఖ్యలో సీమాంధ్ర ప్రాంత ఓటర్లు ఉండటం వల్లే మల్కాజిగిరి టిడిపికి బలమైన సీటుగా గుర్తింపు పొందింది. అక్కడ ఆ పార్టీ గెలుపు ఖాయమనే అనేక మంది నేతలు ఆ సీటు కోసం పోటీ పడుతున్నారు.
ఇప్పుడు రేవంత్ వ్యాఖ్యలు అక్కడి సీమాంధ్ర ఓటర్లలో ప్రతికూలతకు దారి తీశాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు మల్కాజిగిరి సీటును ఆశిస్తున్న రంగారెడ్డి జిల్లా టిడిపి నేతలు కూడా రేవంత్‌పై గురిపెట్టి మాట్లాడుతున్నారు. రంగారెడ్డి జిల్లాకు ఆయన కూడా స్థానికేతరుడేనని, ఆ మాటలు ఆయనకూ వర్తిస్తాయని వారంటున్నారు.












Click it and Unblock the Notifications