వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ కస్టడీపై హైడ్రామా: స్టీఫెన్ నోట 'కోడ్', కేసు మలుపు తిరుగుతుందా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నోటుకు ఓటు వ్యవహారంలో చర్లపల్లి జైలులో ఉన్న రేవంత్ రెడ్డిని కస్టడీలోకి తీసుకునే విషయమై హైడ్రామా నడిచింది. అనంతరం మధ్యాహ్నం ఆయనను ఏసీబీ కార్యాలయానికి తరలించినట్లుగా తెలుస్తోంది. చర్లపల్లి జైలు అధికారులు రేవంత్‌ను కస్టడీకి అప్పగించినట్లు చెప్పారు.

ఉదయం 9:30 గంటలకు ఒకే ఆర్డర్‌ కాపీపైన ముగ్గురు నిందితులను ఏసీబీ అధికారులకు అప్పగించినట్లు చెప్పారు. అయితే, రేవంత్ అప్పటికి ఇంకా జైలులోనే ఉన్నట్లు రేవంత్ తరఫు లాయర్లు చెప్పారు.
మార్చారు.

సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలను ఏసీబీ కార్యాలయానికి తరలించి అధికారులు రేవంత్ రెడ్డిని మాత్రం చర్లపల్లి జైలులోనే విచారించేందుకు సిద్ధపడినట్లుగా వార్తలు వచ్చాయి.

Revanth Reddy issue: Hawala code to be sought

దీనిపై రేవంత్ తరఫు న్యాయవాదులు మాట్లాడుతూ... రేవంత్ మినహా ఇద్దర్ని ఏసీబీ కార్యాలయానికి తీసుకు వచ్చారని, అతనిని మాత్రం చర్లపల్లి జైలులోనే ఉంచారని ఆరోపించారు. చర్లపల్లి జైలులో ప్రశ్నించడం చట్ట విరుద్దమన్నారు. తమ సమక్షంలోనే విచారణ జరగాలన్నారు. కాగా, అనంతరం రేవంత్ రెడ్డిని మధ్యాహ్నం ఏసీబీ కార్యాలయానికి తీసుకు వెళ్లారని తెలుస్తోంది.

అప్పటికే బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయంలో మరో ఇద్దరు నిందితులు సబాస్టియన్, ఉదయ్ సిన్హాలను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. రేవంత్ రెడ్డిని, మరో ఇద్దరిని వేరువేరుగా విచారించడం ద్వారా ఎక్కువ సమాచారాన్ని సేకరించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

సబాస్టియన్‌, ఉదయ్ సిన్హాను ప్రశ్నించిన అనంతరం వారు ఇచ్చే సమాచారం ఆధారంగా రేవంత్‌ను ప్రశ్నించాలని ఏసీబీ ఆలోచించినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వారి తరపు న్యాయవాదుల సమక్షంలో విచారించాల్సి ఉంటుంది.

ఓటుకు నోటు కేసులో 'కోడ్'

ఈ కేసులో హవాలా మార్గాలు చోటు చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం దానిని నిగ్గుతేల్చాలని చూస్తున్నారు. వీడియో టేపుల సంభాషణలో కోడ్ ప్రస్తావన ఉంది.

పెద్దమొత్తంలో డబ్బును అధికారికంగా చేరవేయడం సాధ్యం కాకుంటే హవాలా మార్గాన్ని ఎంచుకుంటారు. స్టీఫెన్ సన్‌కు అడ్వాన్సుగా ఇచ్చిన రూ.50 లక్షలు పోను, మిగతా రూ.4.5 కోట్లను హవాలా మార్గంలో అందజేసేందుకు ప్రణాళిక వేశారని, దీనిలో భాగంగానే రేవంత్ కోడ్‌ను ప్రస్తావించి ఉంటారని అనుమానిస్తున్నారు.

అదే నిజమైతే కేసు అనూహ్య మలుపు తిరుగుతుంది. వీడియోలో.. మధ్యలో ఓ చోట కోడ్ అనే మాట వచ్చింది. రూ.50 లక్షలు ఇచ్చాక మిగతా డబ్బులు ఎక్కడ ఇస్తారని స్టీపెన్ ప్రశ్నించారు. దానికి రేవంత్.. రేపు రాత్రి మా మనిషి మీకు అందజేస్తాడని చెప్పారు.

దానికి స్టీపెన్ కోడ్ అని అడిగారు. రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో చెబుతామని జవాబిచ్చారు. కోడ్ అనేది హవాలాకు సంబంధించినదని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.

English summary
Revanth Reddy issue: Hawala code to be sought
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X