టీడీపీకి మకిలి అంటకుండా: బాబు కోసం రేవంత్ ప్లాన్, బరిలో ఎవరు?

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సాహసం చేస్తున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. నామినేటెడ్ ఎమ్మెల్యేకు లంచం ఇవ్వజూపిన కేసులో రేవంత్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే.

అయితే, రేవంత్ వీడియోను ఆసరాగా చేసుకొని తెలంగాణలోని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం, ఏపీలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు చంద్రబాబును లక్ష్యంగా చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ టీడీపీకి రాజీనామా చేయాలనే ఆలోచన చేసినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

వైసీపీ, తెరాసలు చంద్రబాబును ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నందున, దీని నుండి పార్టీని, అధినేతను కాపాడుకునేందుకు.. మలికి పార్టీకి అంటకుండా ఉండేందుకు ఆయన టీడీపీకి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Revanth Reddy plan to avoid party and Chandrababu

రేవంత్ స్థానంలో ఆయన సోదరుడు లేదా భార్య రాజకీయ ఆరంగేట్రం చేస్తారా అనే చర్చ సాగుతోంది. రేవంత్ టీడీపీకి రాజీనామా చేయడంతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయవచ్చునని అంటున్నారు. అనంతరం ఎన్నికల్లో రేవంత్ కుటుంబ సభ్యులు బరిలో దిగవచ్చునని భావిస్తున్నారు.

ఇప్పటికే రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ఖతమ్ అనే చర్చలు సాగుతున్నాయి. మరోవైపు అంతలేదని తెలుగుతమ్ముళ్లు చెబుతున్నారు. అయితే బాబుకు, పార్టీకి మకిలి అంటించకుండా ఉండేందుకు రేవంత్ తీసుకునే చర్య తెలుగు తమ్ముళ్లకు ఆనందమేనని చెప్పవచ్చు.

రేవంత్ రెడ్డి పైన నాలుగేళ్ల పాటు బహిష్కరణ వేటు వేయాలని తెరాస ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ లోగానే రేవంత్ రెడ్డిచే రాజీనామా చేయించి, కొండంగల్‌లో ఎన్నికలకు వెళ్లాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+