టిఆర్ఎస్ అవసరం లేదు: కెసిఆర్‌పై రేవంత్, నాగం ఫైర్

పాలమూరుకు సంబంధించి తాగునీటి ప్రాజెక్టులు, లక్షలమంది వలస పోయిన కూలిల కోసం ఎప్పుడు కెసిఆర్ పార్లమెంటులో అడగలేదన్నారు. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు తెలంగాణను పంచుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, వలసల నేపథ్యంలో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఎందుకు అడగలేదన్నారు.
అమరవీరుల కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీని ఎందుకు అడగలేదో చెప్పాలన్నారు. దొంగల పార్టీలు ఏకమై తెలంగాణను పంచుకోవాలని పన్నాగం పన్నుతున్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర లాభాలన్నీ కెసిఆర్ కుటుంబానికేనా అన్నారు.
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని, ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని, ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌ను కలిసినప్పుడు కెసిఆర్ ఏం చర్చించారో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రజలు స్మరించుకోవాల్సింది ఆచార్య జయశంకర్‌నే తప్ప కెసిఆర్‌ను కాదన్నారు.
పదవుల కోసం కెసిఆర్ ప్రతిపాదనలు పెడుతున్నారన్నారు. తెలంగాణ క్రెడిట్ అంతా తనకే దక్కాలని చూస్తున్నారని, దానిని తిప్పు కొట్టాల్సిన అవసరముందన్నారు. సోనియాను కలిసేందుకు వెళ్లినప్పుడు తెలంగాణ ఉద్యమకారులను కాకుండా కుటుంబ సభ్యులను తీసుకు వెళ్లడమేమిటని ప్రశ్నించారు.
ఇక తెలంగాణ రాష్ట్ర సమితి అవసరం లేదన్నారు. కెసిఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే బీడీ కట్టల పైన పుర్రె గుర్తు వచ్చిందని తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. బాబ్లీ ప్రాజెక్టు కడుతుంటే కెసిఆర్ ఎప్పుడైనా అడ్డుకునే ప్రయత్నాలు చేశారా అని ప్రశ్నించారు. తెలంగాణ సమస్యలపై పోరాడేందుకు ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశమే అన్నారు.
కెసిఆర్ పైన నాగం ఆగ్రహం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముప్పై పార్టీల మద్దతు ఉందని కెసిఆర్ చెప్పారని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, నాగర్ కర్నూలు శాసన సభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి వేరుగా అన్నారు. ఆయన చెప్పిన పార్టీలలో ఒక్కటి కూడా ముందుకు రాలేదన్నారు. విశ్వసనీయత, నిజాయితీతో వ్యవహరించిన పార్టీ కేవలం బిజెపియే అన్నారు.












Click it and Unblock the Notifications