వీడియోల లీక్: స్టీఫెన్ సన్‌తో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు?

హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఆంగ్లో ఇండియన్ శాసనసభ్యుడు స్టీఫెన్ సన్‌తో డీల్ కోసం తెలుగుదేశం తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి జరిపిన సంభాషణల వీడియోలు లీకయ్యాయి. తెలుగు న్యూస్ చానెల్స్ వాటిని ఆదివారం రాత్రి ప్రసారం చేశాయి. డీల్ కుదుర్చుకోవడానికి జరిపిన సంభాషణలతో పాటు స్టీఫెన్ సన్‌కు సంచుల్లో తెచ్చిన డబ్బులను చూపించి, నోట్ల కట్టలను టేబుల్‌పై సర్దిన దృశ్యాలను కూడా టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి.

సంచుల్లో తెచ్చిన డబ్బులను రేవంత్ రెడ్డి స్టీఫన్ సన్‌కు చూపించడమే కాకుండా వాటిని టేబుల్ మీద సర్దిపెట్టించిన దృశ్యాలను కూడా ప్రసారం చేశాయి. వేయి, ఐదు వందల రూపాయల నోట్ల కట్టలను టేబుల్‌పై సర్దారు. తన బాస్ పంపిస్తేనే తాను వచ్చానని రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్‌తో చెప్పారు.

Video pickup

ఏదైనా జరిగితే తనదే బాధ్యత అని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక్కడేమైనా ప్రాబ్లం వస్తే ఎపిలో చూపిస్తానని రేవంత్ రెడ్డి స్టీఫన్ సన్‌కు హామీ ఇచ్చారు. తాను ఏదైనా మాట ఇస్తే నెరవేరుస్తానని చెప్పారు. ఇది వంద శాతం కాన్ఫిడెన్షియల్ అని నమ్మబలికారు. మా బాసే మీ వద్దకు పంపించారని రేవంత్ రెడ్డి స్ఠీఫెన్ సన్‌తో చెప్పారు. తాను బాబు వద్దకు తీసుకుని వెళ్తానని కూడా చెప్పారు.

వేం నరేంద్ర రెడ్డికి తానే టికెట్ ఇప్పించానని, వేం నరేంద్ర రెడ్డికి తానే ఫైనాన్స్ చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. తన కూతురు పెళ్లి తర్వాత తాను ఫ్రీ అవుతానని చెప్పారు. ఈ వ్యవహారాన్ని మీ పార్టీ (టిఆర్ఎస్) గుర్తించలేదని చెప్పారు. తెలంగాణలో పార్టీని తాను లీడ్ చేస్తానని, మరో ఆరు నెలల్లో టిడిపి తెలంగాణ అధ్యక్షుడిని అవుతానని, మహానాడులోనే ప్రకటిస్తానని చంద్రబాబు అంటే తాను వద్దన్నానని చెప్పారు. జిమ్మి, మట్టయ్యలను అప్రోచ్ అయ్యామని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు.

ఎపిలో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది నిర్ణయం కాలేదని, ఇక్కడేమైనా అయితే అక్కడ ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి స్టీఫనె సన్‌కు చెప్పాడుర. మీరేదైనా నెంబర్ చెప్తే బాబుకు చెప్తానని ఆయన అన్నారు. కొంత అడ్వాన్స్ ఇస్తా, కొంత డిపాజిట్ చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. తనకు కాస్ట్ ఉంది, బంధువులున్నారని ఆయన చెప్పారు. జైపాల్ రెడ్డి మామ అవుతాడని, జానారెడ్డి కూడా బంధువు అవుతారని అన్నారు. క్లారిటీ ఉంది కాబట్టే ఇంత దూరం వచ్చానని అన్నారు. బాబు కూడా తన వర్త్‌ను గుర్తించినట్లు చెప్పుకున్నారు. 25 ఏళ్లుగా పాలిటిక్స్‌లో ఉన్నానని చెప్పారు.

తెలంగాణలో జానా రెడ్డి పని అయిపోయిందని, కెసిఆర్‌తో కొట్లాడలేమని అన్నారని, వెనక ఉండి తనను సపోర్టు చేస్తానని అన్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. మీకు అమౌంట్ కావాలంటే ఇప్పుడే ఇస్తామని మొదటిసారి డీల్ కుదుర్చుకునే సమయంలో రేవంత్ రెడ్డి చెప్పారు. మీరేం కావాలన్నా ఇస్తామని, ఇక్కడ కాకున్నా కేంద్రంలోనైనా పదవి ఇప్పస్తామని, కానీ టైమ్ పడుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆదివారంనాడు స్టీఫెన్ సన్‌కు 50 లక్షల రూపాయలు ఇవ్వడానికి వచ్చిన రేవంత్ రెడ్డి మిగతా డబ్బులను రాత్రి తొమ్మిదిన్నరకు పంపిస్తానని చెప్పారు. టీడిపికి ఓటేస్తే ఏమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్‌తో చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+