హైద్రాబాద్‌లో ప్రతీకార కాల్పులు, కుటుంబ కక్షల వల్లే!(పిక్చర్స్)
హైదరాబాద్: విజయవాడ జాతీయ రహదారిపై పెద్ద అవుటపల్లి వద్ద ఆరేడు నెలల క్రితం జరిగిన హత్యాకాండకు కొనసాగింపుగా బుధవారం హైదరాబాదులో కాల్పులు జరిగాయి. హైదరాబాద్ సరూర్ నగర్ జింకలబావి కాలనీలో బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో నాగరాజు అనే జ్యోతిష్కుడిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
నాగరాజు చికెన్ తీసుకొని ఇంటికి వెళ్తుండగా హెల్మెట్లు ధరించి ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు సమీపం నుండి కాల్పులు జరిపారు.
కాల్పుల మోత విన్న ఆయన భార్య దేవీ, తనయుడు శివకృష్ణ పరుగెత్తుకు వచ్చారు. అనంతరం అఏతనిని ఆసుపత్రికి తరలించారు. ఎల్బీనగర్ డీసీబీ తప్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ.. పెద్ద అవుటపల్లి దుశ్చర్యకు కొనసాగింపుగా ఈ ఘటన చేసుకున్నట్లుగా ప్రాథమిక సమాచారంలో తేలిందన్నారు.

జ్యోతిష్కుడు నాగరాజు
పాత కక్షల నేపథ్యంలో పట్టపగలు హైదరాబాద్‌లో దుండగులు కాల్పులకు తెగబడ్డారని చెబుతున్నారు. ఈ కాల్పుల్లో తీవ్ర గాయాల పాలైన జ్యోతిష్యుడు నాగరాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

జ్యోతిష్కుడు నాగరాజు
బుధవారం మధ్యాహ్నం పన్నెండున్నర.. ఒకటి గంటల సమయంలో నాగరాజుపై.. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు.

జ్యోతిష్కుడు నాగరాజు
నాగరాజు కడుపు, నాభికి ఎడమ వైపు, తొడ మీద బుల్లెట్ గాయాలయ్యాయి. అతనిని హుటాహుటిన స్థానికంగా ఆసుపత్రికి తరలించారు.

జ్యోతిష్కుడు నాగరాజు
కాల్పుల్లో గాయపడ్డ నాగరాజు పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ హత్యాయత్నానికి నేపథ్యం ఏలూరులో మొదలైన కుటుంబ కక్షలని తెలుస్తోంది.

జ్యోతిష్కుడు నాగరాజు
ఇప్పటికే రెండు కుటుంబాల మధ్య నాలుగు హత్యలు జరగ్గా ఐదో వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది.

జ్యోతిష్కుడు నాగరాజు
తాజాగా హైదరాబాద్ నగరంలో జరిగిన కాల్పుల ఘటనలో కూడ ఈ ముఠాలే పాల్గొని ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

జ్యోతిష్కుడు నాగరాజు
దుండగుల కాల్పుల్లో గాయపడ్డ జోతిష్యుడు నాగరాజు కూడా ఒక హత్య కేసులో ప్రధాన నిందితుడు.

జ్యోతిష్కుడు నాగరాజు
పశ్చిమ గోదావరి జిల్లా పెద్ద వేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన కూరపాటి నాగరాజు (60) వృత్తిరీత్యా జోతిష్యుడు.

జ్యోతిష్కుడు నాగరాజు
అదే గామ్రానికి చెందిన బూతం గోవిందు, బూతం దుర్గారావు, బూతం శ్రీనివాస్ రావు అనే అన్నదములకు నాగరాజు కుటుంబానికి ఆధిపత్య పోరు ఉంది.

జ్యోతిష్కుడు నాగరాజు
దీనికి తోడు తొమ్మిదేళ్ల క్రితం గోవిందు కుమార్తె ఉమాదేవిని నాగరాజు పెద్ద కుమారుడు శివకృష్ణ ప్రేమించి వివాహం చేసుకున్నాడు.

జ్యోతిష్కుడు నాగరాజు
దీంతో ఆ రెండు కుటుంబాల మధ్య వైరం ముదిరింది. ఈ క్రమంలో గత ఏడాది ఏప్రిల్ 6వ తేదీన దుర్గారావు హత్యకు గురయ్యారు. ఈ కేసులో నాగరాజు కూడా ఓ నిందితుడు.

జ్యోతిష్కుడు నాగరాజు
గత ఏడాది సెప్టెంబర్ 24వ తేదీన దుర్గారావు హత్య కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు ముంబై నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకి వచ్చిన మారయ్య, పగిడి మారయ్య వారి తండ్రి నాగేశ్వరరావుపై దుండగులు పెద అవుటపల్లి వద్ద కాల్పులు జరిపి హతమార్చారు.

జ్యోతిష్కుడు నాగరాజు
తాజాగా సరూర్ నగర్ జింకలబావి కాలనీలో భార్య దేవి, కుమారులు శివకృష్ణ, చిరంజీవితో కలిసి ఉంటున్న నాగరాజుపై హత్యాయత్నం చేశారు.

జ్యోతిష్కుడు నాగరాజు
తమ కుమారుడికి ప్రేమ వివాహం జరిగినప్పటి నుంచి తమ కుటుంబాల మధ్య గొడవలు ముదిరాయని నాగరాజు భార్య దేవి అంటున్నారు.

జ్యోతిష్కుడు నాగరాజు
ఇప్పటికే తన తండ్రి, సోదరులను పొట్టనబెట్టుకున్నారని ఇప్పుడు తన భర్తను హతమార్చేందుకు యత్నించారని ఆమె రోదిస్తున్నారు. వారిద్దరినీ అరెస్ట్ చేస్తేనే ఈ హత్యలు ఆగుతాయన్నారు.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications