ఈసారైనా మాజీ స్పీకర్ కెఆర్ గెలిచేనా: విద్యార్థి నేత ఢీ

తెలంగాణ ఇచ్చిన తమ పార్టీని ఆదరిస్తారని కెఆర్ సురేష్ రెడ్డి, తెలంగాణ తమ వల్లే సాధ్యమైందని, అందుకే ప్రజలు తమ వైపే ఉంటారని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. టిడిపి ఇచ్చిన లేఖ వల్లనే తెలంగాణ సాధ్యమైందని, అంతేకాకుండా తాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందున అది ప్లస్ అవుతుందని చెబుతున్నారు.
మరోవైపు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న బిజెపితో పొత్తు ఉండటం లాభిస్తుందని భావిస్తున్నారు. బిసిలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఇది కూడా తనకు కలిసి వస్తుందని ధీమాగా చెబుతున్నారు. ఆర్మూర్‌లో త్రిముఖ పోటీ నెలకొని ఉంది.
2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏలేటి అన్నపూర్ణమ్మ ఈసారి పోటీ నుంచి తప్పుకొన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కెఆర్ సురేశ్ రెడ్డి.. 2009 ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి పోటీ చేసి అన్నపూర్ణమ్మ చేతిలో ఓడిపోయారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్న విశ్వాసంతో ఓటర్లు తనవైపే ఉంటారని ఆయన అంటున్నారు. ఓడిపోయినప్పటికీ తాను చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసునని అంటున్నారు. ఆశన్నగారి జీవన్ రెడ్డి తెలంగాణ కెసిఆర్ వల్లే సాధ్యమైందని చెబుతూ విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఐకాస నేతగా ఉద్యమంలో రాజారాం యాదవ్ కీలక భూమిక పోషించారు. ఒంటిపై లాఠీలు విరిగినా, అక్రమ కేసులు పెట్టినా, పదుల సార్లు జైలుకు పంపించినా పట్టువదలకుండా ప్రత్యేక తెలంగాణ కోసం తాను చేసిన పోరాటాలను ప్రజలు మరిచిపోలేదని ఆయన అంటున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications