ఫ్యాన్స్, కాపులను పవన్ వెన్నుపోటుతో - ఆర్జీవీ సంచలనం..!!

జనసేన అధినేత వపన్ కల్యాన్ తాజా వ్యాఖ్యలు రాజకీయ చర్చగా మారాయి. పొత్తులు..ముఖ్యమంత్రి పదవి పైన చేసిన కామెంట్స్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాను ముఖ్యమంత్రి రేసులో లేనంటూ పవన్ కల్యాణ్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. తాను సీఎం కావాలని టీడీపీ, బీజేపీ ముందు షరతు పెట్టనని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఇదే వ్యాఖ్యల పైన వివాదాస్పద దర్శకుడు ఆర్జీవి స్పందించారు. పవన్ ను ఉద్దేశించి వరుస ట్వీట్లు చేసారు.

పొత్తులపై క్లారిటీ:పవన్ ఇప్పటి వరకు కొనసాగుతున్న పొత్తుల పైన చర్చకు క్లారిటీ ఇచ్చారు. పొత్తులు ఉంటాయని తేల్చి చెప్పారు. బలం ఉన్న పార్టీలే కూటమిగా మారుతామని వెల్లడించారు. వామపక్షాలకు అవకాశం లేదని చెప్పారు. టీడీపీ, బీజేపీ తో పొత్తు ఉంటుందని చెప్పకనే చెప్పారు. అదే సమయంలో తాను సీఎంగా ఉండాలని చాలా మంది అనుకుంటున్నారని..సీఎం పదవి వరించాలి కాని, తాను సీఎం పదవి కోసం తాను వెంపర్లాడనని స్పష్టం చేసారు. దీని ద్వారా ఏపీలో పవన్ వ్యాఖ్యల పైన రాజకీయంగా చర్చ మొదలైంది. పవన్ సీఎం కావాలని కోరుకుంటున్న అభిమానులను మరోసారి మోసం చేసారని వైసీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు కోసం పవన్ పని చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

RGV made Serious comments on Pawan Kalyan

ఆర్జీవి పోస్టింగ్స్:ఇదే సమయంలో దర్శకుడు ఆర్జీవి పవన్ వ్యాఖ్యలపైన సీరియస్ వ్యాఖ్యలు చేసారు. ఆ రోజు @ncbn #NTR ని వెన్నుపోటు పొడిచిన దానికన్నా దారుణంగా ఈ రోజు @PawanKalyan తన జనసైనికులని , తన ఫ్యాన్స్ ని వెన్నుపోటు పొడిచి చంపేసాడు.. వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ నా ప్రగాఢ సానుభూతి ..అంటూ పోస్టు చేసారు. మరో ట్వీట్ లో తన సొంత ఫ్యాన్స్ నే కాకుండా, తన కాపుల్ని, చివరికి తనని తానే వెన్నుపోటు పొడిచేసుకున్నాడు..అంటూ ఆర్జీవి కామెంట్స్ చేసారు. దీనికి ఒక వీడియో జత చేసారు. అందులో పవన్ గతంలో చెప్పిన అంశాలతో పాటుగా..పవన్ నటించిన సినిమాల్లోని అంశాలు..డైలాగ్స్ ఉన్నాయి. ఆర్జీవి పోస్టు పై అనుకూలంగా.. విమర్శిస్తూ కామెంట్స్ కనిపిస్తున్నాయి.

మూడు పార్టీలు కలుస్తాయా:ఈ మాత్రం దానికి నీకో పార్టీ పిడికిలి, ఎర్ర కండువాలు, చేగువేరాలు అంటూ వీడియో తో పాటుగా కామెంట్ పోస్టు చేసారు. పవన్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ సాగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనం బలం చూపించి సత్తా చాటి పదవులు తీసుకోవాలని, కండీషన్లు పెడితే కాదని పవన్ వివరించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని స్పష్టం చేసారు. తాను సీఎం పదవి అడగాలని చేస్తున్న వాదనలో పస లేదని పవన్ చెప్పుకొచ్చారు. దీని ద్వారా పాత్తుల్లో టీడీపీకి మద్దతుగా నిలిచేందుకు పవన్ సిద్దమయ్యారనే కామెంట్స్ మొదలయ్యాయి. దీని ద్వారా టీడీపీతో పొత్తు ఖాయమని చెబుతూనే .. బీజేపీని ఒప్పించే ప్రయత్నం చేస్తామని పవన్ పరోక్షంగా స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+