త్రివిక్రమ్ తప్పులేదు: అజ్ఞాతవాసి ఫలితాలపై పవన్ కళ్యాణ్‌కు రామ్ గోపాల్ వర్మ సెటైర్
హైదరాబాద్/అమరావతి: అజ్ఞాతవాసి సినిమా విషయంలో అందరూ డైరెక్టర్ త్రివిక్రమ్‌ను టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు.
దీనిపై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఇందులో త్రివిక్రమ్ తప్పు లేదన్నారు. ఈ చిత్రం ఫలితం విషయంలో ఆయన తప్పు ఏమీ లేదని చెప్పారు.

అంతా పవన్ కళ్యాణే చేశారని వర్మ అభిప్రాయపడ్డారు. ట్వీట్ చదివితే పరోక్షంగా పవన్‌పై విమర్శలు గుప్పించినట్లుగా ఉంది.
అజ్ఞాతవాసి ఫలితాలకు దర్శకుడిని బ్లేమ్ చేయడం సరికాదని, ఎందుకంటే పవన్ కళ్యాణ్ వంటి ఆకాశం మీద దుప్పటి కప్పడం స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కేమరూన్‌ల తరం కూడా కాదన్నారు.












Click it and Unblock the Notifications