వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసైనికులకు రాం గోపాల్ వర్మ కీలక సూచన..!!

వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ మరోసారి సంచలన ట్వీట్లు చేసారు. ఆ ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

|
Google Oneindia TeluguNews

వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ మరోసారి సంచలన ట్వీట్లు చేసారు. చంద్రబాబు - పవన్ భేటీ తరువాత వరుస ట్వీట్లు..కామెంట్లతో ఆర్జీవీ వార్తల్లో నిలిచారు. ఆర్జీవీ చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారాయి. సామాజికవర్గాల ప్రస్తావనతోనూ పేర్లు ప్రస్తావించకుండా ట్వీట్లు పోస్టు చేసారు. వారాహి వాహ‌నాన్ని పంది బ‌స్సు అని కొంద‌రు వ్యాఖ్య‌లు చేసిన‌ప్పుడు కూడా రాంగోపాల్ వ‌ర్మ త‌న‌దైన శైలిలో ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఇప్పుడు పవన్ గురించి జనసైనికులకు సూచనలు చేస్తూ ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఆర్జీవి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. రాజకీయంగా కొంత కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబు - జనసేనాని పవన్ లక్ష్యంగా కొన్ని ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పుడు చేసిన ఒక ట్వీట్ లో ఆ నాడు జూలియస్ సీజర్ ని బ్రూటస్ , ఎన్టీఆర్ ని నాదెండ్లభాస్కర్రావు , ఎన్టీఆర్ ని మళ్ళీ చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్లే ఈ సారి పవన్ కల్యాణ్ ను నాదెండ్ల మనోహర్..చంద్రబాబు ఇద్దరూ కలిసి వెన్నుపోటు పొడుస్తారని నాకు రాత్రి కలలో దేవుడు చెప్పాడు..అంటూ ట్వీట్ చేసారు.

RGV Tweets on Chandra Babu and Manohar goes viral, Suggestion for Janasena Supporters

మరో ట్వీట్ లో ప్రియమైన జనసైనికులారా దయచేసి మన లీడర్ని ,వెన్నుపోటు నాదెండ్ల భాస్కరర రావు కొడుకు నాదెండ్ల మనోహర్ కు దూరంగా ఉండమని చెప్పండి. ..ఇంతకు ముందు పవనిజం బుక్ రాసిన రాజు రవితేజ గురించి ఇలాగె వార్నింగ్ ఇచ్చాను...నా మాటే నిజమైంది అంటూ మరో ట్వీట్ చేసారు. ఇప్పుడు ఆర్జీవీ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. అటు వైఎస్సార్ మరణం తరువాత 2019 లో జగన్ సీఎం కావటం వరకు వ్యూహం సినిమా తీసేందుకు ఆర్జీవీ సిద్దమయ్యారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని గతంలోనే వెల్లించారు.

English summary
Sensational Director Ram Gopal Varma Tweets on Chandra Babu and Nadendal Manohar, suggets for Janasena Vounteers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X