అలా ఆలోచించటానికి చంద్రబాబును కాదు - జగన్, సంచలన "వ్యూహం"..!!
ఎన్నికల వేళ మరో సంచలనం. జగన్ ను ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ సిద్దమవుతున్న వేళ కొత్త "వ్యూహం" సిద్దమైంది. సంచలన దర్శకుడు ఆర్జీవీ సినిమా వ్యూహం టీజర్ విడుదల అయింది. వైఎస్సార్ మరణం తో ఏర్పడిన అనిశ్చితి..తదనంతర పరిణామాలు..చంద్రబాబు ఎత్తులను చిత్తు చేసిన విధానం ప్రధానాంశాలుగా ఆర్జీవి ఈ చిత్రం ఆసక్తి కరంగా మలిచారు. ఈ టీజర్ కు విడుదలైన నిమిషాల్లో భారీ వ్యూస్ దక్కించుకుంటోంది. రాజకీయంగా సంచలనంగా మారుతోంది.
వ్యూహం టీజర్ వచ్చేసింది : సీఎం జగన్ 2009 - 2014 పొలిటికల్ లైఫ్ అంటేనే ఆసక్తి కరం. అటువంటి ఆసక్తకర రియల్ పోరాటం..ఇప్పుడు వెండితెర పైన చూపించేందుకు దర్శకుడు రాం గోపాల్ వర్మ బాగానే కష్టపడ్డారు. అసలు ఆర్జీవీ జగన్ గురించి ఏం చెప్పబోతున్నారు....కేసులు..సీబీఐ విచారణ గురించి ఏం చూపిస్తారనేది కొద్ది రోజులుగా ఉత్కంఠ పెంచుతోంది. వీటన్నింటికీ ఆర్జీవీ వ్యూహం టీజర్ లోనే సమాధానం ఇచ్చారు.

2009 సెప్టెంబర్ 2న నాటి సీఎం వైఎస్సార్ హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్ లో ప్రయాణం ప్రారంభించటంతో ఈ టీజర్ మొదలైంది. ఆ ప్రమాదంలో వైఎస్సార్ మరణంతో ఒక్క సారిగా జరిగిన మార్పులు..చోటు చేసుకున్న రాజకీయం.. జగన్ కటుుంబం చేసిన పోరాటం..కేసులు..సీబీఐ విచారణలు..పాదయాత్ర..ముఖ్యమంత్రిగా జగన్ గెలుపు వరకు ఈ వ్యూహంలో ఉన్నట్లు టీజర్ ద్వారా స్ఫష్టం అవుతోంది.
జగన్ రియల్ లీఫ్ పై ఆర్జీవీ మూవీ : జగన్ తన తండ్రి మరణం తట్టుకోలేక ఓదార్పు యాత్రకు వెళ్లిన సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆంక్షలతో పార్టీ వీడిన సమయం నుంచి పెట్టిన కేసులు...సీబీఐ విచారణల సమయంలో జగన్ కటుంబం పడిన బాధను మరోసారి చూపించే ప్రయత్నం చేసినట్లు అర్దమవుతోంది. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రను అజ్మల్ అమీర్ పోషిస్తుంటే..వైఎస్ భారతి పాత్రను మానస రాధా కృష్ణన్ పోషించారు.
మొదటి భాగం వ్యూహం కాగా రెండవ భాగం శపథం. అయితే ఇవి బయోపిక్స్ కాదని రియల్ పిక్స్ అని రామ్‌గోపాల్ వర్మ కోట్ చేసారు. వైఎస్సార్ మరణం తరువాత చోటు చేసుకున్న పరిణామాలు..రాజకీయ వ్యూహాలో ఇందులో ప్రధాన అంశాలు ఉన్నట్లు ఆర్జీవి స్పష్టం చేసారు. విజయమ్మ పాత్ర కూడా హైలైట్ చేసారు. చంద్రబాబు పాత్ర విషయంలోనూ ఆర్జీవి ఆచి తూచి వ్యవహరించినట్లు కనిపిస్తోంది.
ఎన్నికల వేళ మరో సంచలనంగా : ఈ టీజర్ లో ప్రారంభం వైఎస్సార్ ప్రయాణం చూపిస్తే..చివర్లో జగన్ పాత్రలో అదిరిపోయే డైలాగ్ తో మరింత ఆసక్తి పెంచారు. అలా ఆలోచించటానికి నేను చంద్రబాబును కాదు అంటూ డైలాగ్ ఆకర్షణగా నిలుస్తోంది. ఇదే సమయంలో కష్టాలు..కేసులు..కుట్రలు అన్నీ ఎదుర్కొన్న తరువాత సీఎం అయిన సంతోషంలో ఉన్న జగన్..
భారతి పాత్రలను చూపిస్తూ టీజర్ ముగించారు. జగన్ పైన కేసుల సమయంలో చంద్రబాబు మంత్రాంగం.. జగన్ వద్దకు వచ్చిన ఆఫర్లు..జగన్ కు హెచ్చరికలు..అయినా జగన్ ఏ రకంగా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగారో ఆర్జీవి వివరించినట్లు స్పష్టం అవుతోది. ఈ సినిమా కోసం సీఎం జగన్ తోనూ ఆర్జీవి పలు మార్లు సమావేశమయ్యారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ఈ వ్యూహం మరో సంచలనానికి కారణం అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications