ఆలింగనం: విజె రియా చక్రవర్తిపై లైంగిక దాడికి యత్నం
ముంబై: ప్రముఖ మోడల్, నటి విజె రియా చక్రవర్తిపై లైంగిక దాడి యత్నం జరిగింది. ఈ విషయాన్ని రియానే స్వయంగా వెల్లడించారు. ఆమె ట్విట్టర్‌లో ఈ విషయాన్ని చెప్పారు. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లోకి వెళుతున్న సమయంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి వెనుకగా వచ్చి ఆలింగనం చేసుకున్నాడని, లైంగిక దాడికి యత్నించాడని చెప్పారు.
అతని నుంచి తప్పించుకునేందుకు తాను చాలా ప్రయత్నించానని తెలిపారు. వెంటనే పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల జనం రావడంతో ఆ వ్యక్తి తప్పించుకున్నాడని తెలిపారు. తర్వాత ఖర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశానని తెలిపారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, సిసిటివి పుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నారని రియా తెలిపారు. లక్కీగా తాను మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నానని, అతనిని ఎదిరించానని తెలిపారు.

ఖర్ పోలీసు స్టేషన్ పోలీసుల నుండి మంచి సహకారం ఉందని చెప్పారు. రియా చక్రవర్తి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. ముంబై సురక్షిత స్థానం కాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని కానీ, తన పైన ఎవరు దాడి చేసారో తెలుసుకోవాలనుకంటున్నట్లు చెప్పారు.
కాగా, రియా చక్రవర్తి మేరే డాడ్ కి మారుతి చిత్రంలో నటించింది. తెలుగులోను నటించింది. ఆ తర్వాత ఎలాంటి అవకాశాలు రాకపోవడంతో ముంబై వెళ్లి ఎంటివి వీడియో జాకీగా చేస్తోంది.












Click it and Unblock the Notifications