దేశంలో అత్యంత ధనవంతులైన ఎంపీలు వీరే
లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీల్లో 93 శాతం మంది ధనవంతులున్నారు. మొత్తం ఎంపీలు 543 కాగా, 504 మంది కోటీశ్వరులే ఉన్నారు. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ - ఏడీఆర్ నివేదిక తాజాగా వెల్లడించింది. 2014లో 82 శాతంగా ధనిక ఎంపీలుంటే 2019 ఎన్నికల్లో 88 శాతానికి పెరగ్గా, ప్రస్తుత ఎన్నికల్లో 93 శాతానికి పెరిగింది.
2014 లోక్‌సభ ఎన్నికల్లో 475 మంది, 475 మంది, 2024లో 504 మంది ఉన్నారు. 2009 ఎన్నికల్లో 315 మంది ఎంపీలు కోటీశ్వరులున్నారు. తాజాగా లోక్ సభలోకి అడుగు పెడుతున్న ధనవంతులైన ఎంపీల జాబితాలో మొదటి రెండు స్థానాల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవారే ఉన్నారు. 18వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు నుంచి ఎంపీగా విజయం సాధించిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, తెలంగాణలో భారతీయ జనతాపార్టీ తరఫున చేవెళ్ల నుంచి గెలుపొందిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి, హర్యానాలో బీజేపీ తరఫున గెలిచిన నవీన్ జిందాల్ మూడోస్థానంలో నిలిచారు. అతి తక్కువ ఆస్తులతో బీజేపీకి చెందిన జ్యోతిర్మయిసంగ్ మహతో జాబితాలో నిలిచారు.

డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు నుంచి గెలుపొందిన పెమ్మసాని ఆస్తుల విలువ రూ.5,705 కోట్లు. చరాస్తుల విలువ రూ.5598 కోట్లు కాగా స్థిరాస్తుల విలువ రూ.106 కోట్లుగా ఉంది. అమెరికాలో నివసించే పెమ్మసానిది గుంటూరు జిల్లా తెనాలికి సమీపంలోని బుర్రిపాలెం గ్రామానికి చెందినవారు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి
ధనిక ఎంపీల్లో రెండో స్థానంలో నిలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డికి రూ.4,568 కోట్ల ఆస్తులు ఉన్నాయి.
నవీన్ జిందాల్
రాజకీయవేత్త, వ్యాపారవేత్త అయిన నవీన్ జిందాల్ మూడో జాబితాలో నిలిచారు. హర్యానాలోని కురుక్షేత్ర నియోజకవర్గం నుంచి గెలుపొందిన జిందాల్‌కు రూ.1241 కోట్ల ఆస్తులు ఉన్నాయి.
ఏడీఆర్ నివేదిక ప్రకారం బీజేపీ తరఫున విజయం సాధించిన 240 మంది ఎంపీల సగటు ఆస్తుల విలువ రూ.50.04 కోట్లుగా ఉంది. 99 మంది కాంగ్రెస్ ఎంపీల సగటు ఆస్తుల విలువ రూ.22.93 కోట్లుగా ఉంది. సమాజ్ వాదీ తరఫున గెలిచిన 37 మంది ఎంపీల సగటు ఆస్తులు రూ.15.24 కోట్లు. తృణమూల్ కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన 29 మంది ఎంపీల సగటు ఆస్తి విలువ రూ.17.98 కోట్లుగా ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున ఏపీ నుంచి ఘనవిజయాన్ని సాధించిన 16 మంది ఎంపీల సగటు ఆస్తి రూ.442.26 కోట్లు.












Click it and Unblock the Notifications