ఈ దిక్కున అన్నం తింటే డబ్బు నష్టం
వాస్తు నిర్మాణ శాస్త్రం మాత్రమే కాదు.. ఇదొక జీవన విధానం. వాస్ ప్రకారం ప్రతి దిక్కుకు ఒక ప్రత్యేకశక్తి ఉంటుంది. ఈ నియమాలు జీవితంలో సుఖ సంతోషాలకు, అభివృద్ధికి అవసరమైనవి. శాస్త్రం ప్రకారం వీటిని నిర్లక్ష్యం చేయరాదు. అలా చేస్తే ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. అలాగే ఆహారానికి సంబంధించి కూడా కొన్ని వాస్తు నియమాలున్నాయి. చిన్న చిన్న నియమాలే పెద్ద పెద్ద ఫలితాలనిస్తాయి.
దక్షిణం వద్దు: వాస్తు ప్రకారం ఆహారం తీసుకునే సమయంలో తూర్పు లేదా ఉత్తరం దిక్కులు ఉత్తమమైనవి. దక్షిణ దిక్కుగా కూర్చుని అన్నం తినకూడదు. దక్షిణం యముడి స్థానం. ఈ దిక్కున భోజనం చేస్తే ఆయుష్షు తగ్గుతుంది.

పశ్చిమం కూడా: వాస్తు ప్రకారం అన్నం తినేందుకు పశ్చిమం కూడా శుభప్రదమైనది కాదు. ఈ దిక్కున కూర్చొని భోజనం చేస్తే అప్పులు పెరుగుతాయనే నమ్మకం ఉంది. తూర్పు లేదంటే ఉత్తరం కూర్చోవాలి. ఈ రెండు దేవతలు కొలువుండే దిక్కులు. ఈ రెండు దిక్కుల్లో అన్నం తింటే లక్ష్మీ కటాక్షం దొరుకుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుందని పండితులు తెలియజేస్తున్నారు.
వాస్తులో మరికొన్ని భోజన నియమాలు:
* కాళ్లకు చెప్పులు ధరించి అన్నం తినకూడదు
* మంచం మీద కూర్చొని అన్నం తినకూడదు.. ఇలాచేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది
* స్నానం చేసిన తర్వాతే భోజనం చేయాలి. స్నానం తర్వాత మంచి దుస్తులు ధరించి అన్నం తినాలి. దీనివల్ల అన్నపూర్ణ ఆశీస్సులతోపాటు
లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.
* పగిలిపోయిన లేదంటే విరిగిపోయి పళ్లెంలో అన్నం తినకూడదు
* అన్నం తినడానికి వంటిల్లు సరైన ప్రదేశం
* సహజమైన గాలి, వెలుతురు ఉండే ప్రదేశంలో అన్నం తినాలి
* తినడానికి సరిపడినంతే వడ్డించుకోవాలి.
* ఎక్కువ వడ్డించుకొని వృథా చేయకూడదు. ఇలా చేస్తే ఆహారాన్ని అవమానించినట్లవుతుంది.
* భోజన పదార్థాలను వృథా చేస్తే ఇంట్లోకి దరిద్రాన్ని ఆహ్వానించినట్లవుతుంది
ఈ చిన్న చిన్న నియమాలను గుర్తుంచుకొని జీవితాన్ని కొనసాగిస్తే పెద్ద పెద్ద కష్టాలను కూడా సునాయాసంగా దాటేస్తారు. కాబట్టి నిర్లక్ష్యం చేయకూడదు.












Click it and Unblock the Notifications