హీరోయిన్‌లా.., తాకరానిచోట్ల తాకాడు, ఆ రోజే ఆత్మహత్య నిర్ణయం!: రిషికేశ్వరి

గుంటూరు: రిషికేశ్వరి రెండో డైరీలో మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీనియర్లు తనను హీరోయిన్‌గా ఉన్నావని టీజ్ చేశారని, తాగిన మైకంలో సీనియర్ విద్యార్థి తనను తాకరాని చోట్ల తాకాడని, అప్పుడే ఆత్మహత్య చేసుకోవాలని డైరీలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.

తాను ప్రాజెక్టు పనిలో బిజీగా ఉన్న సమయంలోను సీనియర్ శ్రీనివాస్‌తో మాట్లాడాలని తనను అనీష ఇబ్బందులు పెట్టేదని, క్లాం రూం, గ్రంథాలయంలోను శ్రీనివాస్ ర్యాగింగ్ చేశారని, శ్రీనివాస్‌ను ప్రేమించమని తనపై అనీష ఒత్తిడి తెచ్చేదని, తాను అతనితో మాట్లాడకుంటే ఎందుకు మాట్లాడవని ఒత్తిడి చేసేదని పేర్కొంది.

కాలేజీలో మొదటి రోజే తనను ర్యాగింగ్చేశారని, నాలుగో ఏడాది విద్యార్థి శ్రీనివాస్‌తో తాను మాట్లాడకుంటే అనీషనే తన ఫోన్ ద్వారా మాట్లాడించే ప్రయత్నం చేసిందని పేర్కొన్నారని తెలుస్తోంది. ఆర్కిటెక్చర్ అధ్యాపకుల తీరును పైనా ఆమె ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది.

Rishikeshwari suicide: Shocking in second diary

శ్రీనివాస్ తనను నిత్యం ర్యాగింగ్ చేసేవాడని, పలుమార్లు వేధింపులు భరించలేక ఫోన్ స్విచ్చాఫ్ చేశానని, అనీష తన సెల్ ఫోన్ స్క్రీన్ షాట్లను శ్రీనివాస్‌కు పంపించిందని, శ్రీనివాస్ నుంచి తనను కొందరు స్నేహితురాళ్లు రక్షించారని ఆమె పేర్కొన్నారని తెలుస్తోంది.

వాళ్ల చేష్టలతో నాకు జీవితం పైన విరక్తి కలిగిందని, కాలేజీ పైన విరక్తి కలిగిందని, బొమ్మలా మారిపోయానని, చాలామంది అబ్బాయిలు తనను అదోలా చూసారని, ప్రెషర్స్ డే చాలా భయంకరమైన రోజని, ఆ రోజు శ్రీనివాస్, జయచరణ్ దారుణంగా ప్రవర్తించారని రాశారని తెలుస్తోంది.

వారిద్దరు ప్రెషర్స్ డే రోజునే గులాబీలిచ్చి ప్రపోజ్ చేశారని, ప్రసాద్, జితేందర్‌లు తనను రక్షించారని ఆమె పేర్కొన్నారు. ఆదిత్య తనకు లవ్ ప్రపోజ్ చేయగా తిరస్కరించానని పేర్కొన్నారని తెలుస్తోంది. ఆర్కిటెక్చర్ చేస్తున్న ప్రతి విద్యార్థి స్టుపిడ్ అని పేర్కొన్నారు. సీనియర్లు అనీష, ఉన్నతి, మౌనిక, శ్వేతలు తనను ర్యాగింగ్ చేశారని పేర్కొన్నారు.

తనకు కంపెనీ ఇవ్వాలని చరణ్ తనను ఇబ్బంది పెట్టాడని, తాగిన మైకంలో అతను తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, తాకరాని చోట్ల తాకి ఇబ్బంది పెట్టాడని, అప్పుడే చనిపోవాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆర్కిటెక్చర్ సహాధ్యాయుల తీరుతో విరక్తి పుట్టిందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+