పోలీసుల అదుపులోనే ఆర్కే, గణేష్: వరవరరావు సంచలనం
హైదరాబాద్/విశాఖపట్నం: విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు గురువారం సంచలన ఆరోపణలు చేశారు. మావోయిస్టు అగ్రనేతలు ఆర్కే, గణేష్ తోపాటు పలువురు కీలక నేతలు పోలీసుల అదుపులోనే ఉన్నారని ఆరోపించారు. సోమవారం ఎన్‌కౌంటర్ జరిగిన రోజే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అనుమానం వ్యక్తం చేశారు.
పోలీసుల అదుపులో ఉంటే వారికి ప్రాణహాని తలపెట్టే అవకాశం ఉందని, వెంటనే వారిని కోర్టులో హాజరుపర్చాలని వరవరరావు డిమాండ్ చేశారు. అయితే, పోలీసులు మాత్రం ఆర్కే, గణేష్ తోపాటు పలువురు అగ్రనేతలు ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్నారని ఇప్పటికే పేర్కొన్న విషయం తెలిసిందే.

అగ్రనేతలే టార్గెట్‌గా కూంబింగ్
మల్కాన్‌గిరి అటవీ ప్రాంతంలో ఆంధ్రా-ఒరిస్సా పోలీసులు గురువారం కూడా కూంబింగ్ కొనసాగిస్తున్నారు. అగ్రనేతలు రవి, ఆర్కేలు లక్ష్యంగా ఆపరేషన్ జరుగుతున్నట్లు సమాచారం. మావోయిస్టుల డెన్ సమీపంలోని కట్ ఆఫ్ ఏరియాలో పోలీసులు భారీగా మోహరించిన ట్లు తెలిసింది.
ఇది ఇలా ఉండగా, సుకుమా జిల్లా కొంట సమీపంలో మురళిగూడ బండ వద్ద ఓ వ్యక్తి మృతదేహం లభించింది. ఆ మృతదేహం వద్ద మావోయిస్టులు కొన్ని పోస్టర్లు వదిలేసి వెళ్లినట్లు తెలిసింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications