RK Roja: వాట్ నెక్స్ట్ ? తేల్చేసిన ఆర్కే రోజా-కీలక వ్యాఖ్యలు..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఎక్కడ చూసినా ఆర్కే రోజా హంగామా కనిపించేది. అసెంబ్లీకి వచ్చినా, నియోజకవర్గానికి వెళ్లినా, ఆడుదాం ఆంధ్ర పోటీల్లో పాల్గొన్నా ఇలా ఎక్కడైనా రోజా హల్ చల్ చేసేవారు. అయితే గత ఎన్నికల్లో నగరిలో ఓటమి పాలైన తర్వాత మాత్రం రోజా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఎంతలా అంటే వైసీపీ కార్యక్రమాలకు కూడా పూర్తిగా దూరంగా ఉండిపోతున్నారు. దీంతో ఆమె ఇక వైసీపీకి దూరమైనట్లే అన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ రోజా స్పందించారు.
ఏపీలో వైసీపీ ఓటమి పాలయ్యాక ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న మాజీ మంత్రి ఆర్కే రోజా ఇవాళ తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. తిరుమల శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుని బయటికి వచ్చిన రోజా.. వైసీపీ నేతల పార్టీ ఫిరాయింపులపై స్పందించారు. ఈ వారంలో వైసీపీ నుంచి ఇద్దరు రాజ్యసభ ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేయడంపై స్పందించిన రోజా వారిపై ఫైర్ అయ్యారు.

వైసీపీ ఎంపీల ఫిరాయింపులపై స్పందిస్తూ గతంలోనూ ఇలాగే పార్టీలు మారిన వారి పరిస్ధితి ఏమైందో గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ నియమించిన వారు ఫిరాయిస్తున్నప్పుడు వారే తప్పో కరెక్టో ఆలోచించుకోవాలని, వీరితో జగనన్నకో, వైసీపీకో ఎలాంటి నష్టం ఉండదన్నారు. పార్టీకి ద్రోహం చేసి వెళ్లినవారిని ఎవరూ గౌరవించరు, క్షమించరన్నారు. తద్వారా తాను కూడా పార్టీ మారబోనని ఆర్కే రోజా సంకేతాలు ఇచ్చేసినట్లయింది.












Click it and Unblock the Notifications