సీఎం చంద్రబాబుపై రోజా వివాదాస్పద వ్యాఖ్యలు(వీడియో)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా చేస్తున్నానని చెప్పుకుంటున్నారని.. అయితే, పనికి రాని విషయాల్లోనే నెంబర్ వన్‌గా చేస్తున్నారని మండిపడ్డారు.
అంతేగాక, చంద్రబాబునాయుడు ఏ విషయంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా చేశారో తెలుసా? అంటూ తీవ్య వ్యాఖ్యలు చేశారు. తాజాగా తాను మాట్లాడిన వీడియోను తన ఫేస్‌బుక్ పోస్టు చేశారు రోజా.

ఎయిడ్స్‌లో నెంబర్ వన్ చేశారు..
‘చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని ఏ విషయంలో నెంబర్ వన్‌గా చేశారో తెలుసా? ఎయిడ్స్‌లో నెంబర్ వన్‌గా చేశారు. ఇది నేను చెబుతున్నది కాదు.. చంద్రబాబుకు మద్దతు తెలిపే ..జ్యోతి పేపరే తెలిపింది' అని రోజా అన్నారు.

మహిళల అక్రమ రవాణాలో..
అంతేగాక, మహిళలను అక్రమంగా రవాణా చేసే రాష్ట్రాల్లోనూ ఏపీ నెంబర్‌గా ఉందని రోజా అన్నారు. ఇది కూడా తాను చెబుతున్నది కాదని... చంద్రబాబుకు మద్దతు తెలిపే ఈ.. పత్రికలో నాలుగు రోజుల క్రితం రాసిందని చెప్పారు.

ప్రపంచంలోనే అవినీతి ముఖ్యమంత్రి..
చంద్రబాబు ప్రపంచంలోనే నెంబర్ వన్ అవినీతి ముఖ్యమంత్రి అని రిపోర్టులు చెబుతున్నాయని రోజా అన్నారు. బాల్య వివాహాల్లోనూ నెంబర్ వన్ లో ఉందని అన్నారు. అంటే పనికి రాని విషయాల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తున్నారని మండిపడ్డారు.
దొంగ ప్రకటనలు.. దేశంలో ధనవంతుడైన సీఎం
తనకి వాచీ లేదని, ఉంగరం లేదని చంద్రబాబు చెప్పుకుంటున్నారని రోజా ఎద్దేవా చేశారు. ఆస్తుల ప్రకటన పేరుతో దొంగ ప్రకటనలు చేస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని ధనవంతులైన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబే నెంబర్ వన్ స్థానంలో ఉన్నారంటే.. ఏవిధంగా అవినీతికి పాల్పడుతున్నారో అర్థమవుతోందని రోజా అన్నారు.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్












Click it and Unblock the Notifications