చిరు లేకుంటే, బాబంటే ప్రేమ! వారి స్క్రిప్టే: పవన్‌కు రోజా కౌంటర్, లోకేష్‌కు చురకలు

తిరుపతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మరోసారి విమర్శల దాడి చేశారు. ఇప్పటికే పవన్‌ కళ్యాణ్‌ది జనసేన కాదని, కేవలం భజన సేన అని ఇటీవల విమర్శించిన రోజా.. తాజాగా, పవన్ చేసిన వారసత్వం వ్యాఖ్యలను తప్పుపట్టారు.

అధికార పార్టీని భుజాలకు ఎత్తుకుని ప్రతిపక్ష పార్టీపై విమర్శలు చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతోందని.. పవన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రోజా మండిపడ్డారు.

 టీడీపీ స్క్రిప్టే

టీడీపీ స్క్రిప్టే

తిరుపతిలో శుక్రవారం రోజా మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు ఇచ్చిన స్క్రిప్టును చదవటం పవన్ అలవాటు చేసుకున్నాడని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. టీడీపీ నేతల మాటలను పవన్ వేదంలా పాటిస్తున్నారని చెప్పారు.

 బాబంటే ఎందుకంత ప్రేమ?

బాబంటే ఎందుకంత ప్రేమ?

ఏపీ సీఎం చంద్రబాబుపై పవన్‌కు ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించారు. వారసత్వం గురించి పవన్ చేసిన వ్యాఖ్యల్ని రోజా తప్పికొట్టారు. వారసత్వం గురించి నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

చిరు లేకుంటే పవన్ ఎవరు?

చిరు లేకుంటే పవన్ ఎవరు?

మెగా హీరో చిరంజీవి లేకుంటే అసలు పవన్ సినిమాల్లోకి వచ్చేవాడా? అని రోజా ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి వారసత్వం అనే అంశంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పుడు చిరు అల్లుడ్ని కూడా సినిమాల్లోకి తీసుకొస్తున్నారని అన్నారు.

తప్పుడు లెక్కల చినబాబు

తప్పుడు లెక్కల చినబాబు

ఈ ఏడాదికిగానూ ఆస్తుల వివరాలు వెల్లడించిన నారా లోకేష్.. వేల కోట్ల రూపాయిలు విలువ చేసే ఆస్తులను వందల కోట్ల లోపే చూపించారని.. ఆ వివరాలన్నీ బోగస్ అని రోజా ఆరోపించారు. తప్పుడు లెక్కలు చినబాబుకు అలవాటయ్యాయంటూ రోజా ఎద్దేవా చేశారు.

 లోకేష్ లాంటి పప్పులు వస్తున్నారు.. జగన్ వస్తే ఏంటి?

లోకేష్ లాంటి పప్పులు వస్తున్నారు.. జగన్ వస్తే ఏంటి?

దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాసేవ చేశారని, ఆయన వారసుడిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చారని రోజా చెప్పారు. లోకేష్ లాంటి పప్పులు రాజకీయాల్లోకి వస్తున్నారని, వారికి మీరు మద్దతు పలుకుతారా? అంటూ పవన్‌ను రోజా ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+