జగనన్న ఓకే అంటే నేనే హోంమంత్రి: రోజా, భర్తపై ఆసక్తికర వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే తనకు హోంమంత్రి పదవి కట్టబెట్టినా చేస్తానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. కానీ, జగన్ ఇస్తారని మనం ఆశపడకూడదని చెప్పారు.

హైదరాబాద్/అమరావతి: వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే తనకు హోంమంత్రి పదవి కట్టబెట్టినా చేస్తానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. కానీ, జగన్ ఇస్తారని మనం ఆశపడకూడదని చెప్పారు. ఒకవేళ జగన్ తనకు హోంమంత్రిగా అవకాశం ఇస్తేమాత్రం మహిళలకు న్యాయం చేస్తానని గురువారం రోజా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ మేరకు చెప్పుకొచ్చారు.

పోరాడుతూనే వస్తున్నా..

పోరాడుతూనే వస్తున్నా..

తాను 2004 నుంచి మహిళల గురించి పోరాడుతున్నానని చెప్పారు. మహిళలకు నష్టం కలిగిస్తోన్న ప్రతి అంశంపై పోరాడుతూనే వస్తున్నానని రోజా తెలిపారు. నేరస్తులని తరిమికొట్టాల్సి ఉందని చెప్పారు. వైయస్సార్ ఆశయాలను కలకాలం నిలబెట్టాలని జగన్ కష్టపడుతున్నారని రోజా చెప్పుకొచ్చారు.

కేసుల నుంచి తప్పించుకుంటూ..

కేసుల నుంచి తప్పించుకుంటూ..

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. ఓటుకునోటు కేసులో దొరికిపోవడంతో కేసుల నుంచి తప్పించుకోవడానికి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని మండిపడ్డారు.

నన్నే టార్గెట్ చేశారు..

నన్నే టార్గెట్ చేశారు..

అంతేగాక, ఎంత ఖర్చైనా తనను నగరిలో మరోసారి గెలవనివ్వకుండా చేయాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. అయితే, రోజా ఇప్పటికే నగరిలో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు సొంత ఇల్లు కూడా నిర్మించుకుంటుండటం గమనార్హం.

దేవుడి ఇలా చేశాడు..

దేవుడి ఇలా చేశాడు..

ఆర్టిస్టుగా తమ కుటుంబంలో ఎవరూ లేకపోయినప్పటికీ తాను సినీరంగంలోకి ప్రవేశించానని రోజా చెప్పారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు తనను దేవుడే సినిమాల్లోకి తీసుకొచ్చాడని వ్యాఖ్యానించారు. అంతేగాక, రాజకీయాల్లోకి వచ్చే అవకాశం సినిమాల ద్వారా కల్పించాడని అన్నారు.

భర్తపై రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

భర్తపై రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

తనకు ఇంట్లో అంతగా ఇబ్బందులేవీ ఉండవని వివరించారు. తనను తన భర్త చాలా అర్థం చేసుకుంటారని రోజా చెప్పారు. తానే ఒక్కోసారి బయట ఉన్న టెన్షన్ల వల్ల విసుక్కుంటానేమోగానీ, తన భర్త(సెల్వమణి) ఏమీ అనరని రోజా చెప్పుకొచ్చారు. తమ అమ్మాయి శాస్త్రవేత్త కావాలని అనుకుంటోందని, తన కుమారుడు మాత్రం ఆర్టిస్టు లేక పొలిటీషియణ్ అవుతానని అంటున్నాడని తెలిపారు. అయితే, తాను మాత్రం మొదట బాగా చదువుకోవాలని చెబుతున్నానని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+