తిరుమలలో బోల్తా పడ్డ జీపు: 10 మందికి గాయాలు
తిరుపతి: తిరుమలలోని పాపవినాశనం తీర్ధం మార్గంలో జీపు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది భక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను టీటీడీ సిబ్బంది హుటాహుటిన తిరుమల కొండపై ఉన్న అశ్విని ఆసుపత్రికి తరలించారు.
ఆదిలాబాద్‌కు చెందిన భక్తులు జీపులో స్వామివారి దర్శన అనంతరం పాపవినాశనం దర్శించుకునేందుకు బయలుదేరారు. పాపవినాశనం సమీపంలోకి రాగానే జీపు అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో 0 మంది భక్తులకు గాయాలయ్యాయి.

పోలీసులు వెంటనే సంఘటనా స్ధలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుమలలో ఉన్న అశ్విని ఆసుపత్రికి తరలించారు. ఇందులో నలుగురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో ఒకరి పరిస్ధితి ఆందోళనకరంగా ఉండటంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications