రోడ్డు ప్రమాదం: పవన్ అభిమాని పరిస్థితి ఆందోళనకరం, అండగా జనసేన
రాజమహేంద్రవరం: పోలవరం పర్యటనకు వచ్చిన తన అభిమాన నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు వెళుతూ రాజమండ్రిలో ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలతో పోరాడుతున్నాడు.

పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యల గూడెంకు చెందిన వీరమళ్ల బాబి మోటార్ బైక్‌పై పోలవరానికి వెళుతుండగా ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీ కొట్టింది. తీవ్ర గాయాలైన బాబి రాజమండ్రిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బాబి పరిస్థితి విషమంగా ఉందని, బాబి వైద్య ఖర్చులకు జనసేన నాయకులు సహకరిస్తున్నారని అతని కుటుంబసభ్యులు తెలిపారు. బాబి ఇంకా స్పృహలోకి రాలేదు. పవన్ వస్తున్నారని ఇంటి నుంచి వెళ్లిన బాబి.. ఇలా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని అతని కుటుంబసభ్యులు కన్నీటిపర్యాంతమవుతున్నారు.












Click it and Unblock the Notifications