ఘోర రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

కర్నూలు: జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వెల్దుర్తి మండలం మల్లేపల్లి స్టేజీ వద్ద కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు.

కేరళ నుంచి హైదరాబాద్‌ వెపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌లో కేరళ రాష్ట్రానికి చెందిన రూబెన్‌.. కేరళ టెక్నో స్కూల్‌ను నిర్వహిస్తున్నారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన కుటుంబంతో సహా కేరళ వెళ్లి మక్తల్‌కు తిరుగు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో వారు ప్రయాణిస్తున్న కర్నూలు జిల్లా వెల్దుర్తి మల్లేపల్లి వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది.

Road accident: Six killed

ఈ ప్రమాదంలో రూబెన్‌ సహా భార్య బిస్మాల్‌, తల్లిదండ్రులు ప్రిషియా, దేవిషియా, ఐదు నెలల కుమారుడు, కారు డ్రైవర్‌ పవన్‌ ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను నిమిత్తం పోస్టుమార్టం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఆర్టీసీ బస్సు బోల్తా: 20 మందికి గాయాలు

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దనేలటూరు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+