హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘రోడ్ డాక్టర్’: రోడ్లపై గుంతలు ఇలా పూడ్సింది(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని గుంతలకు అప్పటికపుడే మరమ్మతులు చేపట్టేందుకు వీలుగా సమకూర్చుకున్న యంత్రాన్ని గురువారం నగర మేయర్ మాజీద్ హుస్సేన్, కమిషనర్ సోమేశ్‌కుమార్‌లు లాంఛనంగా ప్రారంభించారు. ఈ యంత్రంతో గుంతలను శాస్ర్తియంగా, నాలుగు కాలల పాటు పదిలంగా ఉండేందుకు వీలుగా మరమ్మతులు చేపట్టేందుకు ఆస్కారమేర్పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. గురువారం నుంచి కేవలం 90రోజుల్లో నగరంలోని అన్ని ప్రాంతాల్లో రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చివేస్తామని అధికారులు చెబుతున్నారు.

ఆ తర్వాత ఎక్కడైనా గుంత కన్పిస్తే ఫొటోతో సహా ఫిర్యాదు చేస్తే నగరవాసులకు నజరానాలు చెల్లించేందుకైనా సిద్దమేనంటూ సవాలు విసురుతున్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ ఇన్ చీఫ్ ధన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. త్వరలో మరో నాలుగు వాహనాలు ఏ మాత్రం ఆలస్యం కాకుండా, పూర్తి నాణ్యతతో అప్పటికపుడే గుంతలను పూడ్చేందుకు అందుబాటులోకి తెచ్చిన వాహనంతో పాటు మరో నాలుగు వాహనాలను త్వరలోనే సమకూర్చనున్నట్లు మేయర్ మాజీద్ హుస్సేన్ తెలిపారు. జిహెచ్‌ఎంసిని గుంతల్లేని రోడ్ల సిటీగా తీర్చిదిద్దటంలో భాగంగా ఈ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు.

మరమ్మతులకు సంబంధించి ఇదివరకున్న ప్రక్రియలో భాగంగా చుడీబజార్‌లోని బల్దియా మిక్స్‌ప్లాంటు నుంచి బిటి మిశ్రమాన్ని తెచ్చి గుంతలను పూడ్చుతున్నట్లు ఆయన వివరించారు. ఈ రకంగా చేస్తే గుంతలు సరిగ్గా పూడ్చుకోకపోవటంతో పాటు వెంటనే మళ్లీ గుంతలు ఏర్పడే పరిస్థితులు తలెత్తుతున్నందున, ఈ సమస్యకు ఆధునిక వాహనంతో చెక్ పెట్టినట్లు తెలిపారు.

బిటి రోడ్ల మరమ్మతులు అప్పటికపుడే చేపట్టేందుకు అందుబాటులోకి తెచ్చిన ఆధునిక వాహనానికి రోడ్డు డాక్టర్‌గా నామకరణం చేసినట్లు కమిషనర్ సోమేశ్‌కుమార్ వెల్లడించారు. ఈ వాహనంతో ఒక్కసారి మరమ్మతులు చేపడితే ఏడాది వరకు రోడ్డు బాగా ఉంటుందన్నారు. ఇలాంటి వాహనాలను త్వరలోనే జోన్‌కు ఒకటి చొప్పున సమకూర్చేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నట్లు వివరిచారు. ఒక్కో గుంతను దాదాపు 30 నిమిషాల పాటు ఎంతో శాస్ర్తియంగా పూడ్చుతున్నట్లు వివరించారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన వాహనంతో ఎంపిక చేసిన 40 ప్రాంతాల్లో గుంతలను పూడ్చే పనులను చేపట్టనున్నట్లు కమిషనర్ వెల్లడించారు.

రోడ్ డాక్టర్

రోడ్ డాక్టర్

నగరంలో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్.. దానికి తోడు రోడ్డుపై అడుగడుగున ఏర్పడ్డ గుంతలు వాహనదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

రోడ్ డాక్టర్

రోడ్ డాక్టర్

ఈ క్రమంలో గుంతలను పూడ్చేందుకు ప్రతి ఏటా కోట్లాది రూపాయలు వెచ్చించినా, ఫలితం దక్కటం లేదన్న విషయాన్ని గుర్తించిన అధికారులు రోడ్లపై గుంతలు పూడ్చేందుకు ఆధునిక యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చారు.

రోడ్ డాక్టర్

రోడ్ డాక్టర్

నగరంలోని గుంతలకు అప్పటికపుడే మరమ్మతులు చేపట్టేందుకు వీలుగా సమకూర్చుకున్న యంత్రాన్ని గురువారం నగర మేయర్ మాజీద్ హుస్సేన్, కమిషనర్ సోమేశ్‌కుమార్‌లు లాంఛనంగా ప్రారంభించారు.

రోడ్ డాక్టర్

రోడ్ డాక్టర్

ఈ యంత్రంతో గుంతలను శాస్ర్తియంగా, నాలుగు కాలల పాటు పదిలంగా ఉండేందుకు వీలుగా మరమ్మతులు చేపట్టేందుకు ఆస్కారమేర్పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

రోడ్ డాక్టర్

రోడ్ డాక్టర్

గురువారం నుంచి కేవలం 90రోజుల్లో నగరంలోని అన్ని ప్రాంతాల్లో రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చివేస్తామని అధికారులు చెబుతున్నారు.

రోడ్ డాక్టర్

రోడ్ డాక్టర్

ఆ తర్వాత ఎక్కడైనా గుంత కన్పిస్తే ఫొటోతో సహా ఫిర్యాదు చేస్తే నగరవాసులకు నజరానాలు చెల్లించేందుకైనా సిద్దమేనంటూ సవాలు విసురుతున్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ ఇన్ చీఫ్ ధన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్ డాక్టర్

రోడ్ డాక్టర్

త్వరలో మరో నాలుగు వాహనాలు ఏ మాత్రం ఆలస్యం కాకుండా, పూర్తి నాణ్యతతో అప్పటికపుడే గుంతలను పూడ్చేందుకు అందుబాటులోకి తెచ్చిన వాహనంతో పాటు మరో నాలుగు వాహనాలను త్వరలోనే సమకూర్చనున్నట్లు మేయర్ మాజీద్ హుస్సేన్ తెలిపారు.

రోడ్ డాక్టర్

రోడ్ డాక్టర్

జిహెచ్‌ఎంసిని గుంతల్లేని రోడ్ల సిటీగా తీర్చిదిద్దటంలో భాగంగా ఈ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు.

రోడ్ డాక్టర్

రోడ్ డాక్టర్

మరమ్మతులకు సంబంధించి ఇదివరకున్న ప్రక్రియలో భాగంగా చుడీబజార్‌లోని బల్దియా మిక్స్‌ప్లాంటు నుంచి బిటి మిశ్రమాన్ని తెచ్చి గుంతలను పూడ్చుతున్నట్లు ఆయన వివరించారు.

రోడ్ డాక్టర్

రోడ్ డాక్టర్

ఈ రకంగా చేస్తే గుంతలు సరిగ్గా పూడ్చుకోకపోవటంతో పాటు వెంటనే మళ్లీ గుంతలు ఏర్పడే పరిస్థితులు తలెత్తుతున్నందున, ఈ సమస్యకు ఆధునిక వాహనంతో చెక్ పెట్టినట్లు తెలిపారు.

రోడ్ డాక్టర్

రోడ్ డాక్టర్

బిటి రోడ్ల మరమ్మతులు అప్పటికపుడే చేపట్టేందుకు అందుబాటులోకి తెచ్చిన ఆధునిక వాహనానికి రోడ్డు డాక్టర్‌గా నామకరణం చేసినట్లు కమిషనర్ సోమేశ్‌కుమార్ వెల్లడించారు.

రోడ్ డాక్టర్

రోడ్ డాక్టర్

ఈ వాహనంతో ఒక్కసారి మరమ్మతులు చేపడితే ఏడాది వరకు రోడ్డు బాగా ఉంటుందన్నారు.

రోడ్ డాక్టర్

రోడ్ డాక్టర్

ఇలాంటి వాహనాలను త్వరలోనే జోన్‌కు ఒకటి చొప్పున సమకూర్చేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నట్లు వివరిచారు. ఒక్కో గుంతను దాదాపు 30 నిమిషాల పాటు ఎంతో శాస్ర్తియంగా పూడ్చుతున్నట్లు వివరించారు.

రోడ్ డాక్టర్

రోడ్ డాక్టర్

కొత్తగా అందుబాటులోకి వచ్చిన వాహనంతో ఎంపిక చేసిన 40 ప్రాంతాల్లో గుంతలను పూడ్చే పనులను చేపట్టనున్నట్లు కమిషనర్ వెల్లడించారు.

English summary
Armed with the new pothole filling vehicle dubbed as the 'road doctor', the Greater Hyderabad Municipal Corporation (GHMC) claims to make the city pothole-free within 90 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X