అనిత అంటే గౌరవం: రోజా క్షమాపణలు చెప్పలేదా? కొత్త వివాదం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వంగలపూడి అనితను అగౌరవపరిచేలా తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా బుధవారం నాడు స్పష్టం చేశారు. ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరైన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు.
అనితకు అగౌరవం కలిగినట్లు అనిత భావిస్తే తాను వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకునేందుకు సిద్ధమని చెప్పారు. అనిత పైన అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు రావడంతో రోజా ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరై వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె మాట్లాడారు.
అనిత అంటే తనకు గౌరవముందన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని, మహిళా సమస్యలపై పోరాడుతున్నందునే తనను లక్ష్యంగా చేసుకున్నారన్నారు. తమ పార్టీ సభ్యులపై టిడిపి ఎమ్మెల్యేలు అభ్యంతరకరంగా మాట్లాడారని, వారిపై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశానని చెప్పారు.

తాము ఇచ్చిన ఫిర్యాదుపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తాను ప్రివిలేజ్ కమిటీని కోరినట్లు చెప్పారు. కాగా, నగరి ఎమ్మెల్యే నటి రోజా బుధవారం ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరై తన వాదనలు వినిపించారు. అనంతరం అనిత బాధపడితే క్షమాపణ చెబుతున్నానని అన్నారు.
రోజా ఇష్యూలో కొత్త ట్విస్ట్
ప్రివిలేజ్ కమిటీ ఎదుట తాను ఎవరికీ క్షమాపణలు చెప్పలేదని, అనని మాటలకు క్షమాపణ చెప్పలేదని, కేవలం గతంలో వ్యాఖ్యలు చేశానని అంటున్నారు కాబట్టి ఆ వ్యాఖ్యలను మాత్రం వెనక్కి తీసుకుంటున్నానని మాత్రమే కమిటీలో రోజా చెప్పారని తెలుస్తోంది. రోజా క్షమాపణలు చెప్పారని కమిటీ చెబుతుండగా, కేవలం తాను వ్యాఖ్యలన వెనక్కి తీసుకుంటున్నట్లు రోజా చెబుతున్నారని తెలుస్తోంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications