దైవసాక్షిగా రోజా, బాలకృష్ణ: ఆంగ్లంలో జగన్ ఎమ్మెల్యే
హైదరాబాద్: నగరి నుండి గెలుపొందిన ఆర్కే రోజా, హిందూపురం నుండి గెలుపొందిన నందమూరి బాలకృష్ణలు గురువారం అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. రోజా, బాలకృష్ణలతో పాటు పలువురు దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎపి అసెంబ్లీ మధ్యాహ్నం ప్రారంభమైంది. ప్రొటెం స్పీకర్ పతివాడ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు.
మొదట ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత ప్రతిపక్ష నేత వైయస్ జగన్, అనంతరం మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరి తర్వాత తొలుత అక్షర క్రమంలో మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా అక్షరాల క్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు.

కొందరు తప్ప దాదాపు అందరు ఎమ్మెల్యేలు తెలుగులో, దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే అంజాద్ బాషా ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు.
కాగా, అంతకుముందు సభ ప్రారంభంకాగానే ఇటీవల మృతి చెందిన తంగిరాల ప్రభాకర్, శోభా నాగిరెడ్డికి సభ సంతాపం తెలిపింది. అనంతరం ఎమ్మెల్యేలుగా సభ్యులు ప్రమాణం చేశారు. ఐదు రోజుల పాటు సమావేశాలు జరుగనున్నాయి. ఎల్లుండి ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు.












Click it and Unblock the Notifications