రెచ్చిపోయారు: వైయస్‌ని శనీశ్వరుడన్న రోజా, ఆధారాలు చూపిన టిడిపి

Posted By:
Subscribe to Oneindia Telugu

చిత్తూరు: నగరి జెడ్పీ సర్వ సభ్య సమావేశం శనివారం సాయంత్రం టిడిపి - వైసిపి నేతల మధ్య వాగ్వాదంతో రసాభాసగా మారింది. ఎమ్మెల్యే రోజా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శించిన పేపర్ కటింగ్స్‌ను టిడిపి ప్రదర్శించింది. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

నన్ను కాల్చి చంపండి: చెవిరెడ్డి, బాబుకు 'చిత్తూరు' భయం: రోజా

గతంలో రోజా తెలుగుదేశం పార్టీలో ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసిపి తరఫున ఏపీ సీఎం చంద్రబాబు పైన దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజా తమ పార్టీలో ఉండగా వైయస్ రాజశేఖర రెడ్డి పైన చేసిన వ్యాఖ్యల ప్రస్తావన, అందుకు సంబంధించిన పేపర్ కటింగ్స్ ముందు పెట్టడంతో గందరగోళం చెలరేగింది.

Roja challenges TDP leaders in ZP meeting

నాడు వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రోజా ఆయనను విమర్శిస్తూ.. 'ముమ్మాటికీ శనీశ్వరుడే... లేకపోతే ఈ ఉపద్రవాలేమిటి?' అంటూ రోజా చేసిన వ్యాఖ్యల పేపర్ కటింగ్స్ టిడిపి నేతలు చూపించారు. పలువురు టిడిపి సభ్యులు రోజాను అడ్డుకున్నారు.

సభను వాయిదా వేస్తున్నట్టు సీఈఓ ప్రకటించగా, ఆపై బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనూ రోజాను టిడిపి జడ్పీటీసీలు అడ్డుకున్నారు.

స్పీకర్‌దే: జగన్‌కు షాకిచ్చిన సుప్రీం కోర్టు, భూమాకు ఊరట

అంతకుముందు రోజా మాట్లాడుతూ... చంద్రబాబు సర్కారు రాజకీయ పక్షపాతం చూపుతున్నారని ధ్వజమెత్తారు. తన నియోజకవర్గానికి వస్తే రుణమాఫీ విషయంలో ఈ విషయాన్ని నిరూపిస్తానని సవాల్ విసిరారు. దీంతో మరోసారి రగడ ప్రారంభమైంది.

నగరి నియోజకవర్గంలో రుణమాఫీ జరిగిందని టిడిపి ఎమ్మెల్యే చెప్పారు. దానికి రోజా మాట్లాడుతూ.. టిడిపి వారికి తప్ప ఎవరికీ రుణమాఫీ కాలేదన్నారు. దీనిపై తాను మంత్రితో, ఎమ్మెల్యేతో అయినా బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. అధికారంలో ఉన్నామని, ఏం చేయాలనుకుంటే అదే చేస్తామంటే సరికాదన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSRCP MLA Roja challenges TDP leaders in ZP meeting.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X