బాబుపై రోజా, 'బాబును అవమానిస్తే అందరికీ అవమానమే, కానీ'
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా శాసన సభ్యురాలు రోజా గురువారం నాడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతికి ప్యాంట్, చొక్కా వేస్తే అది చంద్రబాబేనని ఎద్దేవా చేశారు.
ఆమె తిరుపతిలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు అవినీతి వల్ల రాష్ట్రాల్లో పరువుపోయిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో తెలుగువాళ్లు తల ఎత్తుకొని తిరగకుండా చేశారన్నారు. సొంత జిల్లాకు తాగు, సాగునీరు ఇవ్వని చంద్రబాబు చిత్తూరు జిల్లా పరువు తీశారన్నారు.
చంద్రబాబు ప్రజాభిమానం కోల్పోయారని వైసీపీ నేత విజయ సాయి రెడ్డి అన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి ఇరవై సీట్లు కూడా రావన్నారు. గత 9 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, ఈసారి ఏడాదికే భ్రష్టు పట్టిందన్నారు.
'5 కోట్ల ఏపీ ప్రజలకు అవమానమే కానీ!'

ఆధారాలు లేకుంటే కనుక, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ చేయడం, ఆయన పైన ఆరోపణలు చేయడం కేవలం ఆయనను మాత్రమే అవమానించినట్లు కాదనీ, ఐదు కోట్ల మంది ఏపీ ప్రజలను అవమానించినట్లేననే వాదనలు వినిపిస్తున్నాయి.
గురువారం ఉదయం యలమంచిలి శివాజీ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడారు. ఏపీ ప్రతినిధి అయిన చంద్రబాబును అవమానిస్తే అది ఏపీని అవమానించినట్లేనని, అయితే తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు పైన తమ వద్ద ఆధారాలున్నాయని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆధారాలుంటే, ఆయన నిజంగానే తప్పు చేస్తే అందుకు శిక్షపడాల్సిందేనని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ, ఉద్దేశ్యపూర్వకంగా అలాంటి ఆరోపణలు చేస్తే మాత్రం ఏపీని కూడా అవమానించినట్లేనని అంటున్నారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications