సిగ్గుపడుతున్నా: రోజా, చంద్రబాబు అసహనం, నేతల పరుగులు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: మంగళవారం నాడు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరిగిన తీరు చూస్తే సిగ్గుగా ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఆమె అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడారు.

శశికళ ఎఫెక్ట్: మోడీ దెబ్బ జగన్‌కు తెలిసొచ్చింది

రైతులపై టిడిపికి చిత్తశుద్ధి లేదన్నారు. పక్క పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలు పెట్టి కొన్నారని ఆరోపించారు. రైతులకు మాత్రం గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు.

 హెరిటేజ్‌లో ఎక్కువకు అమ్ముతున్నారు

హెరిటేజ్‌లో ఎక్కువకు అమ్ముతున్నారు

అలాగే రైతుల దగ్గర తక్కువ ధరకు పంటలను కొనుగోలు చేసి హెరిటేజ్‌లో ఎక్కువ ధరకు అమ్ముతున్నారని రోజా ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెస్ పైన బురద జల్లి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, దీనిని రైతులు, ప్రజలు గమనిస్తున్నారన్నారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై బాబు ఆగ్రహం

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై బాబు ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం కమిటీ హాల్లో టిడిపి శాసనసభా పక్ష సమావేశానికి హాజరు కావాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముందుగానే సమాచారం ఇచ్చారు. కానీ దీనికి పలువురు హాజరు కాలేదు. చెప్పినా రాకపోవడంపై చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించింది.

ఒక్కరొక్కరు రావడంపై..

ఒక్కరొక్కరు రావడంపై..

సమావేశానికి చంద్రబాబు వచ్చి కూర్చునే సమయానికి చాలా వరకూ కుర్చీలు ఖాళీగా ఉండటం, ఆపై ఒక్కొక్కరూ వస్తుండటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సభ్యల తీరు నచ్చలేదన్నారు.

పరుగుపెట్టిన ఎమ్మెల్యేలు

పరుగుపెట్టిన ఎమ్మెల్యేలు

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేసిన చంద్రబాబు.. ప్రజా సమస్యల గురించి చర్చిద్దామంటే, స్పందన చూపకపోవడం భావ్యం కాదన్నారు. చంద్రబాబు ఆగ్రహం గురించి తెలుసుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరుగు పరుగున కమిటీ హాల్‌కు వచ్చారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Roja fires at TDP government, Chandrababu unhappy with MLAs
Please Wait while comments are loading...