అఖిలప్రియ దుస్తులపై రోజా మాట్లాడటమా, సర్వనాశనమే: అయ్యన్న
మంత్రి అఖిలప్రియ దుస్తులపై వైసిపి ఎమ్మెల్యే రోజా మాట్లాడటం విడ్డూరమని మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం విమర్శించారు.
నంద్యాల: మంత్రి అఖిలప్రియ దుస్తులపై వైసిపి ఎమ్మెల్యే రోజా మాట్లాడటం విడ్డూరమని మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం విమర్శించారు.
రోజా ఎక్కడ కాలు పెడితే అక్కడ సర్వనాశనమే అన్నారు. ఆమెది ఐరన్ లెగ్ అన్నారు. రోజా ఉపయోగిస్తున్న భాష చాలా దారుణంగా ఉందన్నారు.

మంత్రి అఖిలప్రియ దుస్తులపై మాట్లాడే ముందు రోజా ఆలోచన చేయాలన్నారు. ఆమె వ్యాఖ్యలు సిగ్గుచేటు అన్నారు. ఎదుటివారిని గౌరవించడం మన సంప్రదాయమని, రోజా నేర్చుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications