నగరిలోనే మకాం: నిర్మాణంలో రోజా కొత్త ఇల్లు ఇదే(పిక్చర్స్)
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రోజా తన సొంత నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. నగరిలో తరచూ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె నగరిలో సొంత ఇల్లు నిర్మించుకుంటుండటం గమనార్హం.
Recommended Video


కొత్త ఇల్లు..
ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న రోజా.. తన కొత్త ఇల్లు అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. గత ఎన్నికల్లో రోజా నగరి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే.

ప్రజలకు అందుబాటులో..
తమ నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఆమె నగరిలోనే ఇల్లు నిర్మిస్తున్నారు. బుధవారం నగరిలో తన ఇంటి నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.

నగరిలో పర్యటన
అంతకు ముందు రోజా నగరిలో పలువురు నేతలను కలిశారు. నగరి మునిసిపల్ వైస్ ఛైర్మన్ నీలమేఘం పెద్ద అన్న పిజి సోమసుందరం మొదలియార్ మృతి చెందిన నేపథ్యంలో నగరి చింతలపట్టెడలో ఆయన కుటుంబ సభ్యులను తాను పరామర్శించినట్లు చెప్పారు.

ఎన్నికల దగ్గరపడుతుండటంతో..
అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నర కాలమే ఉండటంతో నియోజకవర్గ ప్రజలకు రోజా అందుబాటులో ఉండాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. సొంత ఇల్లు ఉంటే ఎక్కువ సమయం ఇక్కడ ఉండే అవకాశం ఉంటుందని ఆమె భావించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications