చంద్రబాబు చిన్న మెదడు చితికింది, దొంగదారిన జగన్‌ను తీసికెళ్లారు: రోజా

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి చిన్న మెదడు చితికిపోయిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా వ్యాఖ్యానించారు. అత్యంత అప్రజాస్వామికమైన రీతిలో జగన్ దీక్షను భగ్నం చేశారని ఆమె ఆరోపించారు. ఆమె మంగళవారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు.

ప్రజల కనీసాసవరాలను పట్టించుకోకుండా మేకిన్ చైనా, జపాన్ అంటూ రాష్ట్ర ప్రజలను చంద్రబాబు అవమానిస్తున్నారని ఆమె అన్నారు. ప్రత్యేక విమానాల్లో తన భజనపరులతో ఎలా తిరుగుతున్నారో చూస్తున్నామని, రాష్ట్రాన్ని దోచి సింగపూర్‌కో మలేసియాకో అమ్మేద్దామని చంద్రబాబు చూస్తున్నారే తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఏ మాత్రం లేదని ఆమె అన్నారు.

ప్రత్యేక హోదా కోసం వైయస్ జగన్ చేపట్టిన దీక్షపై మంత్రులు, ముఖ్యమంత్రి ఎలా ఎగతాళిగా మాట్లాడారో అంతా చూశామని, నిన్నటి వరకు అసలు దాన్ని పట్టించుకోనట్లున్నారని, తర్వాత దొంగ దారిన దీక్షను భగ్నం చేయాలని చూశారే తప్ప ఒక మంచి విషయం కోసం దీక్ష చేస్తుంటే కనీసం మంత్రులను పంపి చర్చలు జరిపించి, ప్రత్యేక హోదా తెప్పిస్తామనే హామీ కూడా ఇవ్వకుండా భగ్నం చేయడం సరి కాదని రోజా అన్నారు.

Roja refutes Chnadrababu attitude on YS Jagan fast

ఇక్కడితో తమ పోరాటాన్ని ఆపేస్తామనుకుంటే అది వాళ్ల భ్రమ అని, టిడిపి ప్రభుత్వంపై తమ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పారు. జగన్ తన పరిశ్రమలు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఏమీ అడగలేదని, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలనే ఏకైక ధ్యేయంతో దీక్ష చేస్తుంటే దానిపై ప్రజల్లో అపోహలు కల్పించే విధంగా ఎలా చేశారో చూశామని ఆమె అన్నారు.

మసీదుల్లో, గుళ్లలో, చర్చిల్లో ప్రజలు చేసిన ప్రార్థనలు చూసి భయపడి, వెన్ను వణికి దొంగదారిన జగన్‌ను తీసుకుని వెళ్లారని ఆమె అన్నారు. చంద్రబాబు, ఆయన మంత్రులు కనీసం ఓ ప్రెస్ మీట్ పెట్టి తాము కూడా ప్రత్యేక హోదా కోసం ప్రయత్నాలు చేస్తున్నామని, దీక్ష విరమించాలని కోరుకుంటున్నామని చెప్పి ఉంటే తాము కూడా హర్షించి ఉండేవాళ్లమని రోజా అన్నారు.

అసలు రాష్ట్రానికి ప్రత్యేక హోదానే అవసరం లేదనే రీతిలో టిడిపి ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. కామినేని శ్రీనివాస్ వంటి పనికిమాలిన వాళ్లను మంత్రులుగా పెడితే వాళ్లు కూడా 420ల లాగా తప్పుడు నివేదికలతో తప్పుదోవ పట్టించడానికి ఎలా చూశారో మనందరికీ తెలుసునని ఆమె అన్నారు. సింగపూర్ వాళ్లకు రాజధానిని అప్పగించి కమీషన్లు ఎలా నొక్కేద్దామా అని చూస్తున్నారని ఆమె అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+