బాలకృష్ణ మాట్లాడితే ఇలా..: రోజా డైలాగ్, నవ్వేశారు
హైదరాబాద్: హీరో, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా శాసన సభ్యురాలు రోజా సెటైర్లు వేశారట. ఆ రోజుల్లో మా నాన్నగారు.. అంటూ ఆమె మీడియా ముందు బాలకృష్ణను అనుకరిస్తూ నవ్వేశారు. తామిద్దరం ఆరు సినిమాలలో నటించామని రోజా ఈ సందర్భంగా ఆన్నారు.

బాలకృష్ణ సినిమా స్టైల్లో అసెంబ్లీలో మాట్లాడితే ఎలా ఉంటుందనే విషయం మీడియాతో అసెంబ్లీ ప్రాంగణంలో పైవిధంగా చెప్పారు. ఆ రోజుల్లో మా నాన్నగారు.. అంటూ మాట్లాడారు. అంతటితో ఆమె ఆపేశారు. దీంతో విలేకరులో మాట్లాడాలని కోరారు.
ఆ రోజుల్లో నాన్నగారు భైరవద్వీపం సినిమాకు డైరక్షన్ చేస్తే మేమూ రోజా నటించాం.. అంటూ చేతులు తిప్పుతూ బాలయ్యలా హావభావాలు ప్రదర్శించారు. దీంతో, అక్కడున్నవారందరూ చిరునవ్వులు చిందించారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications