Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకొని.., బాబుతో కరువు ఖాయం: దులిపేసిన రోజా

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా గురువారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోశారు. చంద్రబాబు పాలన రాక్షస పాలన అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకొని చంద్రబాబు గెలిచారని అభిప్రాయపడ్డారు.

ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొంటున్నారన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. చంద్రబాబు అవినీతిని జాతీయ పార్టీల దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. చంద్రబాబు రాజకీయాలకు పట్టిన చెద అన్నారు.

రాజకీయాలు, ఏపీ అభివృద్ధితో నేను తన మనవడితో కూడా ఆడుకోలేకపోతున్నానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు.

వైసిపి నుంచి టిడిపిలోకి వెళ్తున్న ఎమ్మెల్యేల మాటలు చూస్తుంటే నవ్వోస్తుందన్నారు. వారి మాటలు విడ్డూరమన్నారు. చంద్రబాబు మంచిని, అభివృద్ధిని చూసి టిడిపిలో చేరుతున్నట్లు వారు చెప్పడం సరికాదన్నారు. ఆయన అవినీతి పైన సిబిఐ విచారణకు సిద్ధమా అన్నారు.

జగన్ తప్పుడు కేసుల వల్ల జైలుకు వెళ్లాడని చెప్పారు. కానీ చంద్రబాబులా చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకొని తప్పించుకోవడం లేదన్నారు. జగన్ ఏ తప్పు చేయలేదు కాబట్టే ఇంకా కోర్టుకు వెళ్తున్నారన్నారు. జగన్ మీలా ఎవరి కాళ్లో పట్టుకోలేదన్నారు.

విజయమ్మ వేసిన కేసులు, గతంలో వేసిన కేసులు, రేవంత్ రెడ్డికి చెందిన ఓటుకు నోటు కేసులలో సిబిఐ విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు. ఇలాంటి నాయకుడి (చంద్రబాబు) క్యారెక్టర్ చూసి మీరు టిడిపిలోకి వెళ్లడం విడ్డూరమన్నారు.

2014లో చంద్రబాబు అంటే నచ్చని వారికి ఇప్పుడు నచ్చడం విడ్డూరమన్నారు. టిడిపిలో చేరుతున్న ఎమ్మెల్యేలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ఎన్టీఆర్‌ను వదిలి, కెసిఆర్‌ను వదిలి, కిరణ్ కుమార్ రెడ్డిని.. చివరకు చంద్రబాబును వదిలి కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారన్నారు.

అంటే వీరంతా అసమర్థులేనా అన్నారు. ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రాన అసమర్థులు కాదన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడం వల్ల ప్రజల్లో టిడిపి దోషిగా నిలబడుతోందని, ఇలాంటి సమయంలో వారు ఎమ్మెల్యేలను చేర్చుకంటున్నారన్నారు.

చంద్రబాబు 24 గంటలు అభివృద్ధి కోసం కష్టపడుతున్నారని, ఆయన అభివృద్ధిని చూసి మేం టిడిపిలో చేరుతున్నామని ఎమ్మెల్యేలు చెప్పడం విడ్డూరమన్నారు. వారు సొంత పనులకు వెళ్తున్నారో, అభివృద్ధిని చూసి చేరుతున్నారో అందరికీ తెలుసన్నారు.

ఏపీ బ్రాండ్ నాశనం చేసేందుకు జగన్ ఢిల్లీ పర్యటన అని టిడిపి నేతలు చెబుతున్నారని, ఇదో కొత్త వాదన అని మండిపడ్డారు. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి పైన రాజా ఆఫ్ కరప్షన్ అనే పుస్తకం తీసుకు వచ్చారని, అప్పుడు ఢిల్లీలో గల్లీ గల్లీలో తిరిగారని, అప్పుడు ఏపీ బ్రాండ్ నాశనం కాలేదా అని ప్రశ్నించారు.

జగన్ ఎంత సమర్థుడో అందరికీ తెలుసునని, అందుకే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశానని చెప్పారు. కానీ చంద్రబాబులా నరేంద్ర మోడీ కాళ్లు, పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకోలేదన్నారు. ప్రపంచ దేశాల్లో ఏపీ బ్రాండుకు చెడ్డ పేరు తెచ్చింది చంద్రబాబే అన్నారు.

కాల్ మనీ - సెక్స్ రాకెట్ వల్ల ఏపీ పేరును దేశ విదేశాల్లో చెరిపేసింది నువ్వే (చంద్రబాబు) అన్నారు. నీళ్ల కోసం అల్లాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలతో మందు తాగించే పనులు చేస్తున్నందున ఏపీ పేరును చెడగొడుతుందే నువ్వు అన్నారు. ఏపీ పేరును చంద్రబాబు పాడు చేసి, జగన్ పేరు చెప్పడం దిగజారుడుతనమన్నారు.

కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని నీ పప్పును ముఖ్యమంత్రిని చేసేందుకే చంద్రబబు ఇదంతా చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజనకు కారణం చంద్రబాబు అని, ఇప్పుడు ఏపీని నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. వైయస్ పేరు చెబితే 108, ఆరోగ్యశ్రీ గుర్తుకు వస్తాయన్నారు.

కానీ చంద్రబాబు పేరు చెబితే కాల్ మనీ సెక్స్ రాకెట్, పట్టిసీమ అవినీతి, రాజధాని లీకేజి, అక్రమాలు... ఇలా అన్నీ గుర్తుకు వస్తాయన్నారు. సేవ్ డెమోక్రసీ అనేది తమ నినాదం అని చెప్పారు. కానీ ఎమ్మెల్యేలను కొంటూ ఆయన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు.

ఓ పార్టీ నుంచి గెలిచి, మరో పార్టీలో ఎమ్మెల్యేలు చేరమని భారత దేశంలోని ఏ చట్టం, ఏ న్యాయం చెబుతుందో ఔట్ డేటెడ్ చంద్రబాబు చెప్పగలరా అని సవాల్ చేశారు. చంద్రబాబు రెండేళ్లలో దోచుకున్న లక్ష కోట్లను ప్రజలకు పంచి పెట్టాలని డిమాండ్ చేశారు. ఆయన ప్రజాస్వామ్యయుతంగా పాలించాలన్నారు.

 Roja slams AP CM Chandrababu

అంతర్గత ప్రజాస్వామ్యం

వైసిపిలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని టిడిపిలో చేరుతున్న తమ ఎమ్మెల్యేలు చెప్పడం విడ్డూరమన్నారు. వైసిపిలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందా, టిడిపిలో ఉందా చూడాలన్నారు. ఎమ్మెల్యేల చేరికతో ఆ పార్టీ టిడిపి ఇంఛార్జులు బయటకు వచ్చి కన్నీళ్లతో మాట్లాడుతున్నారని, ఇదేనా అంతర్గత ప్రజాస్వామ్యం అన్నారు.

కరణం బలరాం, శిల్పా మోహన్ రెడ్డి తదితరులు బాధపడ్డారని, వారు మొదటి నుంచి టిడిపి జెండా మోశారని, అలాంటి వారు కంటతడి పెట్టడం అంతర్గత ప్రజాస్వామ్యమా అన్నారు. వైసిపిలో ప్రజాస్వామ్యం లేదని చెప్పడం సకరికాదన్నారు. సుజయ చేరే విషయం మంత్రి మృణాళికి తెలియదని, జ్యోతుల నెహ్రూ చేరిక చినరాజప్పకు తెలియదని, భూమా చేరిక శిల్పా సోదరులకు తెలియదని, ఇదేనా అంతర్గత ప్రజాస్వామ్యం అన్నారు.

స్వయంగా చంద్రబాబుకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌తో కంటతడి పెట్టించినా, ఆయనను వైస్రాయ్ వద్ద నడి రోడ్డు పైన చెప్పులతో కొట్టారని, ఇదేనా అంతర్గత ప్రజాస్వామ్యం అన్నారు. నాడు ఎన్టీఆర్‌ను చంపేశారని, ఇప్పుడు వైసిపి లేకుండా చేయాలని చూస్తున్నారన్నారు.

చంద్రబాబుకు పౌరుషం, దమ్ము, ధైర్యం ఉంటే.. నీవు చేస్తుంది కరెక్ట్ అయితే, నీవు ఒక్క రూపాయి దోచుకోలేదని కాణిపాకం ముందు ప్రమాణం చేయగలవా అని సవాల్ చేశారు. ఎమ్మెల్యేలు అభివృద్ధి చూసి మాత్రమే వస్తున్నారని, భార్యాబిడ్డల పైన ప్రమాణం చేయగలరా అన్నారు.

చంద్రబాబు, లోకేష్ జైలుకు

ఎమ్మెల్యేలు డబ్బు సంచులకు, మంత్రి పదవులకు ఆశపడి టిడిపిలో చేరుతున్నారన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నందునే తాము ఢిల్లీ వెళ్లామని, ఆయన పైన ఫిర్యాదు చేశామని చెప్పారు. చంద్రబాబు పైన తమ పోరాటం అర్థం చేసుకొని త్వరలో సిబిఐ విచారణ వేస్తారని భావిస్తున్నామన్నారు. అప్పుడు చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ కటకటాలకు వెళ్తారన్నారు.

బాబు వస్తే కరవు

జగన్ ఏపీ బ్రాండ్ కోసం కష్టపడుతున్నారని, చెడగొట్టేందుకు కాదన్నారు. రాక్షసులకు విష్ణుమూర్తిని చూస్తే భయమని, అలాగే చంద్రబాబుకు జగన్‌ను చూస్తే భయమన్నారు. జగన్ ప్రజల తరఫున పోరాడుతున్నారని రోజా చెప్పారు. బాబు వస్తే జాబు వస్తుందో లేదో కానీ, ఆయన వస్తే కరువు వస్తుందని మాత్రం మరోసారి నిరూపితమయిందన్నారు. గతంలో ఏడేళ్లు, ఇప్పుడు రెండేళ్లు కరువు వచ్చిందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+