ఎన్టీఆర్ పై రోజా పవర్ ఫుల్ స్టేట్ మెంట్

అనంతపురానికి చెందిన తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. జూనియర్ అభిమానులు.. అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయాన్ని చుట్టుముట్టడం, దగ్గుపాటి ఫ్లెక్సీలను చించివేయడం వంటివి.. పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.

ఈ పరిణామాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్ కే రోజా స్పందించారు. వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ చిన్నచూపేనని అన్నారు.

Roja s Powerful Reaction to TDP MLA s War 2 Comments

జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శనను ఆపాలనుకోవడం అంటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపినట్టే అవుతుందని రోజా వ్యాఖ్యానించారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారని, ప్రజల్లో మాస్ ఇమేజ్ ఉన్న హీరో సినిమాను అడ్డుకోవాలనుకోవడం హాస్యాస్పదమని చెప్పారు.

ఈవీఎంలను మార్చి, కోట్లాదిమంది ప్రజలను మోసం చేసినంత సులువుగా సినిమా ప్రదర్శనలను అడ్డుకోలేరని రోజా పేర్కొన్నారు. సినిమా బాగుంటే అది విజయవంతం కాకుండా ఎవరూ అడ్డుకోలేరని, బాగోలేకపోతే ఎవరూ దాన్ని ఆడించలేరని స్పష్టం చేశారు. ఈ విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరి హర వీరమల్లు సినిమాతో నిరూపితమైందని చెప్పారు.

టీడీపీ- జనసేన శాసన సభ్యులు తలకిందులుగా తపస్సు చేసి, టికెట్లు ఫ్రీగా ఇచ్చినా కూడా హరి హర వీరమల్లు సినిమాను ఎవరూ చూడలేదని రోజా గుర్తు చేశారు. వాళ్లు ఎంతగా ఆడించాలని ప్రయత్నించినా అది సాధ్యపడలేదని రోజా అన్నారు. స్వయానా పవన్ కల్యాణ్ అభిమానులే ఆ సినిమాను చూడటానికి థియేటర్లకు రాలేదని పేర్కొన్నారు.

రాజకీయాలను రాజకీయాలుగానే చేయాలని, సినిమాలను సినిమాలుగా చూడాలని రోజా హితవు పలికారు. సినిమా ఫంక్షన్లల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, సవాళ్లు చేయడం వంటివి జరిగితే గేమ్ ఛేంజర్ గానీ, హరి హర వీరమల్లు లాంటి సినిమాలు ఏమయ్యాయో మనం కళ్లారా చూశామని అన్నారు.

సినిమాలు, రాజకీయాలను మిక్స్ చేయడం మంచిది కాదని రోజా అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేడని, ఆయన సినిమాలు చేసుకుంటోన్నాడని, ఆయన సినిమాలు ఎంత హిట్ అవుతున్నాయో.. అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అవార్డులు సొంతమౌతున్నాయో మనం చూస్తున్నామని అన్నారు. ఆయన సినిమాలను ఆపాలనుకుంటే చూసే జనం నవ్వుతారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+