కార్డాన్ సెర్చ్‌లో పైల్వాన్ అరెస్టు: నీటి పైపులో పాము, మెట్రో పనుల్లో అపశ్రుతి
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నగరంలోని పాతబస్తీలో సౌత్‌జోన్ పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. రెయిన్‌బజార్, యాకత్‌పురా, భవానీ నగర్, మీర్‌చౌక్ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. రౌడీషీటర్లు జాఫర్ పైల్వాన్, సలీమ్ పైల్వాన్, చోటా మహ్మద్ ఇళ్లలో పోలీసులు సోదాలు జరుపుతున్నారు. గత కొంతకాలంలో రౌడీషీటర్లు ఫైనాన్స్ నగదు ఇచ్చిన వాటిని చెల్లించని వారిపై వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసు శాఖ రౌడీషీటర్ల ఇళ్లపై సోదాలు చేపట్టారు.
అయితే పోలీసులను రాకను గుర్తించిన రౌడీషీటర్ జాఫర్ పైల్వాన్ వారిని లోనికి రానివ్వకుండా గేట్లు మూసివేశాడు. భారీ బలగాలతో లోనికి ప్రవేశించిన పోలీసులు సోదాలు నిర్వహించి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రౌడీషీటర్ జాఫర్ పైల్వాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మంది పైల్వాన్ల ఇళ్లలోనూ పోలీసులు సోదాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
మంచినీటి పైపులో పాము

ఇదిలావుంటే, రంగారెడ్డి జిల్లాలోని పత్తిపురంలో తాగు నీటి పంపులో పాము రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. స్థానిక రక్షిత మంచి నీటి పైపులో నుంచి పాము వచ్చింది. గతంలోనే ఇదే పంపు నుంచి చేపలుకూడా బయటపడ్డాయని మహిళలు తెలిపారు. దీనిపై రక్షిత మంచినీటి అధికారులకు చెప్పినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు.
మెట్రో పనుల్లో అపశ్రుతి
హైదరాబాద్ నగరంలోని మెట్రో రైలు పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. కేపీహెచ్‌బీలో మెట్రో రైలు నిర్మాణ పనుల్లో పిల్లర్‌పై నుంచి రాడ్ పడి ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బైక్‌పై వెళ్తున్న ప్రవీణ్ అనే వ్యక్తి తలపై పిల్లర్ రాడ్ పడింది. తీవ్ర రక్త స్రావం అవుతుండటంలో దగ్గర్లో ఉన్న కానిస్టేబుల్ బాధితుడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
హైదరాబాదులో బుల్లెట్లు లభ్యం
హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో బుల్లెట్లు కలకలం రేపుతున్నాయి. షాపూర్‌నగర్‌లోని జగద్గిరిగుట్ట ప్రాంతం హెచ్‌ఎంటీ సమీపంలో ఓ బ్యాగులో బుల్లెట్లు లభ్యమయ్యాయి. చెట్లపొదల్లో బ్యాగును గుర్తించిన పశువుల కాపరి పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకుని బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. పాయింట్ 32, ఎయిట్ ఎంఎఎం బుల్లెట్లుగా గుర్తించారు. బుల్లెట్లు ప్రైవేటు వ్యక్తులకు చెందినవిగా పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications