గ్యాంగ్ వార్: అనుచరుడి చేతిలో రౌడీషీటర్ హతం

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం గుణ్ణంపల్లి వద్ద శనివారంనాడు కాల్పులు జరిగి ఒక వ్యక్తి మరణించాడు. ఒక మద్యం దుకాణం వద్ద ఈ సంఘటన జరిగింది. కాల్పుల్లో మరణించిన పచ్చా మధు తాడేపల్లిగూడెం వాసి అని తెలుస్తోంది.

పచ్చ మధు తన సోదరుడు దుర్గాప్రసాద్, బంధువు పందక జగన్మోహన్, మరో వ్యక్తి బండి కాళికృష్ణలోత కలిసి ఓ వాహనంలో ఏలూరు వైపు వెళ్తున్నారు. మార్గమధ్యంలో మద్యం సేవించేందుకు ఆగారు. వీరిలో దుర్గాప్రసాద్, జగన్మోహన్ బజ్జీలు తెచ్చేందుకు బయటకు వెళ్లగా మద్యం సేవిస్తున్న పచ్చ మధు (34)ను అతని వెంట ఉన్న బండి కాళికృష్ణ తన వెంట తెచ్చుకున్న నాటు తుపాకితో కాల్చి చంపాడని ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత అదే వాహనంలో అతను పరారయ్యాడు. గొడవనే ఈ సంఘటనకు దారి తీసిందనే వాదన కూడా వినిపిస్తోంది.

Murder

పచ్చ మధుపై ఏలూరు పోలీసు స్టేషన్లలో ఆరు హత్యా నేరాలు నమోదై ఉన్నాయని డిఎస్పీ సరిత చెప్పారు. కాళికృష్ణ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ఏలూరు కోర్టు ఆవరణలో హత్యకు గురైన తాడేపల్లిగూడేనికి చెందిన రౌడీషీటర్ బోయిన రవి కేసులో మధు ముద్దాయి.

బోయిన రవికి అనుచరుడిగా ఉంటూనే అతన్ని మధు కాల్చి చంపాడు. అదే రీతిలో ఇప్పుడు అనుచరుడి చేతిలో మధు హతమయ్యాడు. కాగా, పోలీసులు నల్లజర్ల సెంటర్ వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండడాన్ని గమనించి కాళికృష్ణ కారును అక్కడే వదిలేసి పారిపోయినట్లు సమాచారం. ఎస్పీ రఘురామిరెడ్డి, డిఎస్పీ సరిత సంఘటనా స్థలాన్ని సందర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+