కాల్‌మనీ: అనారోగ్యం పేరిట ఎస్కేప్, ఆసుపత్రిలో దొరికిపోయాడు
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌మనీ కేసులో నిందితుడిగా ఉన్న మాధంశెట్టి శివకుమార్ ఈ కేసు నుంచి బయటపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. కాల్‌మనీ కేసులో మాధంశెట్టి శివకుమార్‌ను ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు.
సోమవారం అతడిని కోర్టు ముందు హాజరుపరచగా రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో శివను జైలుకు తరలిస్తుండగా జైలు ప్రాంగణానికి సమీపంలో తనకు అనారోగ్యంగా ఉందని చెబుతూ ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. దీంతో చేసేదేమిలేక పోలీసులు అతడిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అయితే ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఈ కేసు నుంచి బయటపడేందుకు మాధంశెట్టి శివకుమార్ ప్రయత్నిస్తున్నాడని డీపీసీ కాళిదాసు రంగారావుకు అనుమానం వచ్చింది. దీంతో ఈరోజు సాయంత్రం ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. మాధంశెట్టి శివకుమార్ ఉన్న గదిలో వెళ్లి చూడగానే అవాక్కయ్యారు.
మాధంశెట్టి శివకుమార్ దర్జాగా, ఆరోగ్యంగా తిరుగుతూ ఉన్నట్లు ఆయన గమనించారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వైద్యులకు చెప్పడంతో మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించారు. శివకుమార్‌కు ఎలాంటి అనారోగ్యం లేదని వైద్యపరీక్షల్లో తేలడంతో అతడిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.












Click it and Unblock the Notifications