హత్య: కళ్లలో కారం కొట్టి వేటకొడవళ్లతో నరికి చంపారు

ధనేశ్వర్ రెడ్డికి, చనిపోయిన చలపతికి గతంలో గొడవలున్నాయి. అంతక ముందే రెండు హత్య కేసుల్లో ముద్దాయిగా ఉన్న పూల చలపతి రెండు సార్లు కిషోర్, అమర్ నాథ్, గంగాధర్, మల్లిఖార్జున, సురేంద్ర రెడ్డిలను కొట్టాడు. ధనేశ్వర్ రెడ్డితో ఉన్న ఫ్రెండ్ షిప్ కట్ చేసుకోని తనతోనే తిరగాలని వార్నింగ్ ఇచ్చాడు. ఈ వాదనను పెడచెవినపెట్టి ధనేశ్వర్ రెడ్డితోనే ఉండటంతో వినాయకచవితి లోపు అంతా ఊరు వదిలి వెళ్లిపోవాలని, లేదంటే నా చేతుల్లో చావడం ఖాయమని బెదిరించాడు. దీంతో ధనేశ్వర్ రెడ్డి, మిగతా ఐదుగురు కలసి వ్యూహం రచించారు.
పూల చలపతిని వదిలిపెడితే మనం ఇబ్బందుల్లో పడతామని అనుకున్నారు. దీనిలో భాగంగా ధనేశ్వర్ రెడ్డితో గొడవపడినట్లు సురేంద్ర రెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి చలపతిని నమ్మించాడు. ధనేశ్వర్ రెడ్డితో తాను విడిపోయానని ఇక నుండి నీతోనే ఉంటానని చలపతితో చేరాడు. వారం రోజుల పాటు చలపతితో తిరుగుతూ అతని ప్రతి కదలికను ధనేశ్వర్ రెడ్డికి చేరవేశాడు.
ఈ నెల 16వ తేదీన రాత్రి చలపతి రింగ్ రోడ్డులోని మద్యం దుకాణంలో తాగి ఒంటరిగా వెళుతున్నాడని ధనేశ్వర్ రెడ్డికి, సురేంద్ర రెడ్డి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో అందరూ ఒక్కటై రెండు ద్విచక్ర వాహనాల్లో వెంబడించి అతని కళ్లలోకి కారం కొట్టి.. వేటకొడవళ్లతో నరికి చంపారు. కేసు నమోదు చేసిన పోలీసులు సెల్ ఫోన్ల ఆధారంగా నిందుతులను గుర్తించారు. నిందుతులను పట్టుకోని విచారించడంతో తమను చంపేస్తాడేమోనన్న భయంతోనే అతన్ని హతమార్చామని నిజాన్ని ఒప్పుకున్నారు.
అసలు సూత్రధారి పరారీలో ఉండగా.. అమర్ నాథ్, మల్లిఖార్జున, సురేంద్ర రెడ్డి, గంగాధర్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. హత్యకు ఉపయోగించిన వేట కొడవళ్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును చేధించిన ఎస్ఐలను డీఎస్పీ అభినందించారు.












Click it and Unblock the Notifications