సినీ ఫక్కీలో ఘరానా దొంగ అరెస్టు (పిక్చర్స్)
విశాఖపట్నం: రైళ్లలో పలు చోరీలకు పాల్పడిన ఘరానా దొంగను రైల్వే రక్షణ దళం సిబ్బంది సినీ ఫక్కీలో పట్టుకున్నారు. ఓ రైలులో దొంగతనం చేసి మరో రైలెక్కి పరారయ్యే ప్రయత్నం చేసిన ఆ దొంగను ఆర్పిఎఫ్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
అతని నుంచి పోలీసులు దాదాపు ఐదుల లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీని, స్వదేశీ నగదును, బంగారు గొలుసు, సెల్‌ఫోన్, ట్యాబ్, పాస్‌పోర్టు స్వాధీనం చేసుకున్నారు. వాటిని విదేశీ ప్రయాణికురాలని తిరిగి విశాఖకు రప్పించి వాటిని అందించారు. తర్వాత నిబంధనల మేరకు రైల్వే పోలీసులకు అప్పగించారు. రైల్వే పోలీసులు అతన్ని పాత నేరస్థుడిగా గుర్తించారు.
విశాఖపట్నం నగరానికి చెందిన శ్రీకాంత్ (35) రైల్లో చోరీలు చేయడంలో ఆరితేరాడు. పలుమార్లు చోరీలకు పాల్పడినా రైల్వే పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూ వస్తున్నాడు. శుక్రవారంనాడు కూడా అతను తన చేతికి పనిచెప్పాడు. హౌరా నుంచి చైన్నైకి వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైల్లో తెల్లవారు జామను నాలుగున్నర గంటలకు విశాఖ రైల్వే స్టేషన్‌లో ఆగింది. ఆ సమయంలో శ్రీకాంత్ చోరీలకు దిగాడు.

విదేశీ ప్రయాణికురాలి బ్యాగ్
కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖలో ఎక్కిన శ్రీకాంత్ నవో నటోబినా అనే విదేశీ మహిళ బ్యాగ్‌ను దొంగిలించి చడీచప్పుడు కాకుండా తిరిగి స్టేషన్‌లోనే దిగి జన్మభూమి ఇంటర్ సిటీలో పరారయ్యేందుకు సిద్ధపడ్డాడు.

ఆర్ఫిఎఫ్ దళానికి ఇలా..
స్టేషన్‌లో సివిల్ యూనిఫాంలో గస్టీ తిరుగుతున్న ఆర్పీఎఫ్ స్పెషల్ టీమ్ సిబ్బందికి నిందితుడు శ్రీకాంత్ కదలికలపై అనుమానం వచ్చింది. దాంతో ఓ కానిస్టేబుల్ పట్టుకుని విచారించేందుకు ప్రయత్నించగా తప్పించుకున్నాడు.

ప్రణాళికబద్దంగా...
కానిస్టేబుల్ నుంచి తప్పించుకున్న శ్రీకాంత్‌పై దృష్టి పెట్టి ఎనిమిదో నెంబర్ ప్లాట్ ఫాంపై ఆర్పిఎఫ్ సిబ్బంది వెంబడించారు. అది గమనించి అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు చాకచక్యంగా వ్యవహరించి అతన్ని అదుపులోకీ తీసుకుని బ్యాగ్‌ను తనిఖీ చేశారు.

బ్యాగ్‌లో విదేశీ కరెన్సీ
బ్యాగ్‌లో జపాన్, అమెరికాకు చెందిన కరెన్సీ, స్వదేశీ నగదు, బంగారం చైన్, ట్యాబ్, సెల్‌ఫోన్, జపా్ పాస్‌పోర్టు కనిపించడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఉన్నతాధికారుల విచారణలో శ్రీకాంత్ నేరాన్ని అంగీకరించాడు.












Click it and Unblock the Notifications