లొంగుబాటా? అరెస్టా? : ఆర్పీఎఫ్ పోలీసుల అదుపులో ముద్రగడ!
కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం కొందరు వ్యక్తులను పిలవగా.. వారితో పాటు ముద్రగడ కూడా వచ్చారని ఆయన చెప్పారు.
విశాఖపట్నం: తుని విధ్వంస ఘటనకు సంబంధించి అనకాపల్లి రైల్వే కోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను ఆర్పీఎఫ్(రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.
అనకాపల్లిలోని ఓ హోటల్ లో ముద్రగడ ఉన్నారన్న సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ భద్రతా దళాలు.. నేరుగా హోటల్‌కు వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. తుని సభ సందర్బంగా.. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ విధ్వంసానికి సంబంధించి రైల్వే పోలీసులు ముద్రగడను కుట్రదారుడిగా పేర్కొన్న సంగతి తెలిసిందే.

తాజా అరెస్టు నేపథ్యంలో.. అప్పటి విధ్వంసానికి సంబంధించి ఆయన్ను మరోసారి విచారించనున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ముద్రగడను అరెస్టు చేయలేదంటూ రైల్వే డీఎస్పీ ప్రకటించడం సంచలనం రేకెత్తిస్తోంది. కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం కొందరు వ్యక్తులను పిలవగా.. వారితో పాటు ముద్రగడ కూడా వచ్చారని ఆయన చెప్పారు. వచ్చినవారిలో కుల రామకృష్ణ, చెల్లా ప్రభాకర్ లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా పేర్కొన్నారు.
ఓవైపు ఆర్పీఎఫ్ పోలీసులు ముద్రగడను అరెస్టు చేశారని.. అనకాపల్లి అంతటా వార్తలు వినిపిస్తుంటే.. మరోవైపు డీఎస్పీ ప్రకటన ఇందుకు విరుద్దంగా ఉండడం సంచలనం రేకెత్తిస్తోంది. దీంతొ అనుచరులతో పాటు వచ్చి ముద్రగడనే లొంగిపోయరా? లేక పోలీసులే అదుపులోకి తీసుకున్నారా? అన్న విషయంపై పూర్తి స్థాయి సమాచారం ఇంకా అందాల్సి ఉంది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications