వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుమ‌ల ఘాట్ రోడ్డులో మ‌రో ప్ర‌మాదం: అదుపు త‌ప్పి, కొండ‌ను రాసుకుంటూ వెళ్లి..!

|
Google Oneindia TeluguNews

తిరుపతి: ప‌్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం ఘాట్ రోడ్డులో మ‌రో ప్ర‌మాదం తృటిలోత‌ప్పింది. తిరుప‌తి నుంచి సుమారు 26 మంది శ్రీవారి భ‌క్తుల‌తో తిరుమ‌ల‌కు బ‌య‌లుదేరిన ఆర్టీసీ బ‌స్సు ప్ర‌మాదానికి గురైంది. మ‌లుపులో అదుపు త‌ప్పింది. ఎడ‌మ వైపు కొండ‌ను ఢీ కొట్టి, ఒరుసుకుంటూ వెళ్లింది. ఈ ప్ర‌మాదంలో భ‌క్తుల‌కు ప్రాణాపాయం త‌ప్పింది.

మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం తిరుప‌తి బ‌స్‌స్టేష‌న్ నుంచి ఆర్టీసీ బ‌స్సు తిరుమ‌ల‌కు బ‌య‌లుదేరింది. అలిపిరి టోల్‌గేట్ దాటిన కొద్దిసేప‌టికే ప్ర‌మాదానికి గురైంది. ఘాట్ రోడ్డు రెండో మ‌లుపులో డ్రైవ‌ర్‌ను బ‌స్సును నియంత్రించ లేక‌పోయారు. వేగంగా వెళ్లిన బ‌స్సు ఎడ‌మ వైపున కొండ‌ను ఢీ కొట్టి, ఒరుసుకుంటూ కొంత‌దూరం వెళ్లింది. వాహ‌నాలు కొండ‌ను ఢీ కొట్ట‌కుండా ఉండ‌టానికి సుమారు అడుగు ఎత్తు వ‌ర‌కు వేసిన డివైడ‌ర్‌ను దాటి వెళ్లి మ‌రీ కొండ‌ను ఢీ కొట్టింది.

RTC Bus met accident at Tirumala Ghat road, devotees are Safe

ఈ ప్ర‌మాదంలో భక్తుల‌కు ప్రాణాపాయం త‌ప్పింది. కొంద‌రికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి. వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించి, చికిత్స అందించారు. క్రేన్ల‌ను తీసుకొచ్చి, బ‌స్సును వెలికి తీశారు ఆర్టీసీ ఉద్యోగులు. కాగా- కొద్దిరోజుల కింద‌టే ఆర్టీసీ బ‌స్సు ఒక‌టి ఇదే ప్రాంతంలో ప్ర‌మాదానికి గురైన విష‌యం తెలిసిందే. గాలీవాన తోడు కావ‌డంతో బ‌స్సు అదుపు త‌ప్పి, లోయలోకి జారిప‌డ‌బోయింది. లోయ అంచుల్లో ఉన్న చెట్ల‌కు చిక్కుకుని నిలిచిపోయింది.

English summary
Road Transport Corporation Bus met accident at Tirumala Ghat Road on Tuesday. Passangers were Safe. Bus, which was carried around 26 Devotees of Lord Balaji move towards Tirumala from Tirupati. After crossing Toll gate near Alipiri met accident. The Bus uncontolled at Second number Ghar road.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X