ఆర్టీసి డ్రైవర్ త్యాగం: తాను మరణిస్తూ ప్రయాణికులను రక్షించాడు
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఓ ఆర్టీసి డ్రైవర్ చేసిన త్యాగం కంట తడి పెట్టిస్తోంది. అతను తాను మరణిస్తూ ప్రయాణికులను కాపాడాడు. అనంతపురం జిల్లాలో రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి దగ్గర ఈ ఘటన జరిగింది.
రాప్తాడు ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నముత్యాలప్ప శనివారం సాయంత్రం పల్లెవెలుగు సర్వీసులో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే బస్సునడుపుతూ ఉండగా ముత్యాలప్పకు గుండెపోటు వచ్చింది. అయినా ముత్యాలప్ప తన ప్రాణాలకంటే ప్రయాణికుల ప్రాణాలకే ప్రాధాన్యం ఇచ్చారు.

బస్సును రోడ్డు పక్కన సురక్షితంగా ఆపిన తర్వాతే తన ప్రాణాలు వదిలాడు. అక్కడ రోడ్డు పక్కనే ఓ పెద్ద గుంత ఉంది. ముత్యాలప్ప చివరి క్షణంలో కూడా చాకచక్యంగా వ్యవహరించి బస్సు గుంత వైపు వెళ్లకుండా నియంత్రించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రయాణికులను ప్రణాప్రాయం నుంచి కాపాడిన ముత్యాలప్ప మాత్రం ప్రాణం విడిచాడు. ఈ ఘటనతో ప్రయాణికులు కన్నీరు మున్నీరుగా విలపించారు.












Click it and Unblock the Notifications