ఆర్టీసీ డ్రైవర్ వెలికి చేష్టలు,10వక్లాస్ విద్యార్ధినిపై దాడి
చిత్తూరు: జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ వెలికి చేష్టలు వెలుగులోకి వచ్చాయి. శనివారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. సత్యవేడు పరిధిలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న సుమన్ అనే వ్యక్తి పదో తరగతి చదువుతున్న ఓ బాలికపై దాడి చేశాడు.
ప్రేమ పేరిట సదరు బాలికను కొంతకాలంగా వేధించిన సుమన్, బాలిక తన ప్రేమను తిరస్కరించిందని దాడికి దిగాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు సత్యవేడు పోలీస్ స్టేషన్‌లో అతనిపై ఫిర్యాదు చేశారు.

బాలిక తల్లితండ్రులు కేసు నమోదు చేసిన విషయాన్ని తెలుసుకున్న సుమన్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications