హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కదలని బస్సు: డిపోల్లో ఉద్రిక్త పరిస్ధితులు, రైల్వేకు కాసుల వర్షం(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వేతన సవరణ విషయంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండు రోజు కూడా ముగిసింది. ప్రయాణీకుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ యాజమాన్యం తొలి రోజు తెలంగాణలో 342 సర్వీసులను నడిపిన అర్టీసీ యాజమాన్యం, రెండోరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1500 బస్సులు నడిపింది.

గురువారం కొన్ని చోట్ల ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలిక బస్సు డ్రైవర్లతో బస్సులు తిప్పేందుకు చేసిన ప్రయత్నాలకు కార్మిక సంఘాలు అడ్డుకున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా డిపోల వద్ద ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో డిపోలు, బస్ స్టేషన్‌లో పోలీసుల కాపలా కాస్తున్నారు. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్రవారం ఎపీ ఎంసెట్ పరీక్ష జరుగుతుండటంతో ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

మరోవైపు ఆర్టీసీ సమ్మె కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ వాహన యజమానులు ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వేకు కాసుల వర్షం కురుస్తోంది. గురువారం వివిధ రైలు మార్గాల్లో రాకపోకలు సాగించిన 16 సాధారణ రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేసింది. శుక్రవారం కూడా మరో 13 రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

 డిపోల్లో ఉద్రిక్త పరిస్ధితులు, రైల్వేకు కాసుల వర్షం

డిపోల్లో ఉద్రిక్త పరిస్ధితులు, రైల్వేకు కాసుల వర్షం

జిల్లా పరిధిలోని ఏడు ఆర్టీసీ డిపోలు నార్కట్‌పల్లి, నల్లగొండ, యాదగిరిగుట్ట, కోదాడ, మిర్యాలగూడ, సూర్యాపేట, దేవరకొండ డిపోల పరిధిలో 730బస్సులు రోడ్డెక్కనివ్వకుండా కార్మిక సంఘాలు డిపోల ఎదుట బైఠాయించి అడ్డుకున్నారు.

 డిపోల్లో ఉద్రిక్త పరిస్ధితులు, రైల్వేకు కాసుల వర్షం

డిపోల్లో ఉద్రిక్త పరిస్ధితులు, రైల్వేకు కాసుల వర్షం

బస్సులు డిపోలకే పరిమితమవ్వగా బస్ స్టేషన్లు బస్సుల రాకపోకలు లేక ప్రయాణికుల రద్దీ లేక బోసిగా మారాయి. కార్మిక సంఘాల సమ్మెకు మద్ధతుగా సిపిఎం, సిపిఐ, న్యూడెమోక్రసీ, సిఐటియు, ఏఐటియుసిలు రంగంలోకి దిగి ధర్నాల్లో పాల్గొన్నారు.

 డిపోల్లో ఉద్రిక్త పరిస్ధితులు, రైల్వేకు కాసుల వర్షం

డిపోల్లో ఉద్రిక్త పరిస్ధితులు, రైల్వేకు కాసుల వర్షం

సమ్మె కారణంగా బస్సులు నడువకపోవడంతో ప్రయాణికులు ఆటోలు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి అధిక చార్జీల భారంతో ఇబ్బందులు పడ్డారు. నల్లగొండ, కోదాడ, యాదగిరిగుట్ట, మిర్యాలగూడ డిపోల వద్ధ తాత్కాలిక డ్రైవర్లతో సహాయంతో పోలీస్ బందోబస్తు మధ్య బస్సులు నడిపించారు.

 డిపోల్లో ఉద్రిక్త పరిస్ధితులు, రైల్వేకు కాసుల వర్షం

డిపోల్లో ఉద్రిక్త పరిస్ధితులు, రైల్వేకు కాసుల వర్షం

ఈ సందర్భంగా ఆయా డిపోల్లో కొంత ఘర్షణాత్మక ధోరణితో ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశారు. నల్లగొండ డిపో వద్ధ తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు డిపో నుండి బయటకు రాగానే కార్మికులు పరుగున వెళ్లి వాటి టైర్ల కింద పడుకుండిపోయారు.

కదలని బస్సు: డిపోల్లో ఉద్రిక్త పరిస్ధితులు, రైల్వేకు కాసుల వర్షం(ఫోటోలు)

కదలని బస్సు: డిపోల్లో ఉద్రిక్త పరిస్ధితులు, రైల్వేకు కాసుల వర్షం(ఫోటోలు)

ఈ సందర్భంగా కార్మికులకు, పోలీసులకు మధ్య తోపులాట, అర్టీసీ అధికారులకు, కార్మిక సంఘాలకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకోవడం కొంత ఉద్రిక్తతకు దారితీసింది.

 డిపోల్లో ఉద్రిక్త పరిస్ధితులు, రైల్వేకు కాసుల వర్షం

డిపోల్లో ఉద్రిక్త పరిస్ధితులు, రైల్వేకు కాసుల వర్షం

అటు విజయవాడ-హైద్రాబాద్ జాతీయ రహదారిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సులు నడువకపోవడంతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు జోరుగా నడువగా ట్రావెల్స్ అధిక చార్జీలతో ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్నాయి.

 డిపోల్లో ఉద్రిక్త పరిస్ధితులు, రైల్వేకు కాసుల వర్షం

డిపోల్లో ఉద్రిక్త పరిస్ధితులు, రైల్వేకు కాసుల వర్షం

జిల్లాలో ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయని అయితే తాత్కాలిక డ్రైవర్ల సహాయంతో 15బస్సులు నడిపించగలిగామని సమ్మె కారణంగా రెండో రోజు కూడా 65లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఆర్టీసీ ఆర్‌ఎం రవీంద్ర తెలిపారు.

 డిపోల్లో ఉద్రిక్త పరిస్ధితులు, రైల్వేకు కాసుల వర్షం

డిపోల్లో ఉద్రిక్త పరిస్ధితులు, రైల్వేకు కాసుల వర్షం

తాత్కాలిక డ్రైవర్ల సహాయంతో నల్లగొండ డిపో నుండి 10, మిర్యాలగూడ నుండి 2, నార్కట్‌పల్లి నుండి 2, కోదాడ నుండి 1 బస్సును నడిపించగలిగామన్నారు.

 డిపోల్లో ఉద్రిక్త పరిస్ధితులు, రైల్వేకు కాసుల వర్షం

డిపోల్లో ఉద్రిక్త పరిస్ధితులు, రైల్వేకు కాసుల వర్షం

అయితే కార్మిక సంఘాలు బస్సులు బయటకు వెళ్లకుండా ఆర్టీసీ అధికారులను, తాత్కాలిక ఉద్యోగులను అడ్డుకున్న సందర్భంలో ఇరువర్గాల మధ్య కొంత ఉద్రిక్తత నెలకొనగా నల్లగొండలో అరెస్టులు చోటుచేసుకున్నాయన్నారు.

 డిపోల్లో ఉద్రిక్త పరిస్ధితులు, రైల్వేకు కాసుల వర్షం

డిపోల్లో ఉద్రిక్త పరిస్ధితులు, రైల్వేకు కాసుల వర్షం

ప్రయాణికుల సౌలభ్యం కోసం ముందస్తు ప్రణాళిక మేరకు 108కాంట్రాక్టు బస్సులు డిపోలకు రాకుండా బయటనే నిర్ధేశిత రూట్‌లలో తిరిగినట్లుగా ఆయన వెల్లడించారు.

English summary
Rtc Strike Continues On 2nd Day In Ap and Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X