ఉద్రిక్తత: బెజవాడకే అవమానం, విష్ణు అరెస్ట్‌పై రఘువీరాను నిలదీసిన మద్దతుదారులు

అమరావతి: కల్తీ మద్యం కేసు బెజవాడ కాంగ్రెస్‌లో చిచ్చుపెట్టింది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘవీరా అధ్యక్షతన ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కల్తీ మద్యం కేసులో అరెస్టైన మల్లాది విష్ణుని సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ విష్ణు వ్యతిరేక వర్గం కాంగ్రెసా పార్టీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టింది.

దీంతో సమాచారం అందుకున్న మల్లాది విష్ణు వర్గం అక్కడికి చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, ఆందోళనకు దిగిన వారిని వారించేందుకు యత్నించారు. మల్లాది విష్ణు అరెస్ట్‌ను పీసీసీ నేతలు పట్టించుకోలేదని విష్ణు అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు.

మాజీ మంత్రులు, జిల్లా అధ్యక్షుడు కనీసం దీని గురించి ప్రస్తావించిన పాపాన పోలేదని పీసీసీ అధ్యక్షుడు రఘవీరా రెడ్డి ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గత రెండు నెలలుగా కల్తీ మద్యం కేసులో విష్ణు నిందితుడిగా ఉన్నాడని వార్తలు వస్తున్నా ఆయన గురించి ఆలోచించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 rumpus at congress meeting in vijayawada over malladi vishnu

అర్ధరాత్రి 2 గంటల సమయంలో కూడా సమస్య వచ్చిందని ఫోన్ చేస్తే స్పందించే నేత మల్లాది విష్ణు అని ఆయన్ను అరెస్ట చేసిన తీరు చాలా బాధకరమని, ఆయన్ని కాపాడలేకపోయి వారు కార్యకర్తలను ఎలా కాపాడగలరని విష్ణు విష్ణు మద్దతుదారులు రఘవీరాను నిలదీశారు.

మల్లాది విష్ణుకు చేసిన దారుణం విజయవాడ సిటీకే అవమానమని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానుల ఆందోళన మధ్య సిటీ కాంగ్రెస్ సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించారు. అనంతరం జైలులో ఉన్న మల్లాది విష్ణును చూసేందుకు రఘవీరా, కేవీపీ, కే రామచంద్రయ్య ముగ్గురు కలిసి వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+