శాడిస్టు భర్త రాజేష్‌ ఏం చెప్పాడంటే ? వీడియో

Posted By:
Subscribe to Oneindia Telugu
Ruthless Husband Rajesh Reveals everything : exclusive Video

పెళ్లైన తొలి రోజునే శోభనం రాత్రి భార్య శైలజ ను చిత్రహింసలకు గురి చేసిన శాడిస్టు భర్త రాజేష్‌ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతన్ని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ నేపధ్యంలో అతను తన వాదనను విన్పిస్తూ మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తుంది. మరి శాడిస్టు భర్త గారు ఏం చెప్పాడో అతని మాటలోన్నే విందాం !

తొలిరాత్రి శోభనం గదిలోకి వచ్చిన శైలజకు రాజేష్ సంసారానికి పనికిరాడన్న విషయం తెలిసింది. అయితే ఈ విషయం బయటపెట్టొద్దని రాజేష్ ప్రాధేయపడ్డాడు. కానీ శైలజ బయటకు వచ్చి తన తల్లిదండ్రులకు విషయం తెలిపింది. దీంతో వారు రాజేష్ తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. తరువాత రాజేష్‌ కి కౌన్సిలింగ్ ఇచ్చి వధూవరులిద్దరినీ మళ్లీ శోభనం గదిలోకి పంపించారు. అయితే విషయం బయటకి పొక్కడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన రాజేష్.. శైలజపై విచాక్షణా రహితంగా దాడి చేశాడు. శైలజ అరుపులు విన్న తల్లిదండ్రులు ఎంత పిలిచినా ప్రయోజనం లేదు. ఇంతలో తీవ్ర రక్తస్రావంతో శైలజ బయటికొచ్చింది. అసలు రాజేష్‌ అంతలా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటో ఎవ్వరికీ అర్ధం కావట్లేదు. సంసారానికి పనికిరానప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు ? ఎప్పటికైనా బయటపడే విషయం బయటపడితే అంత కోపం ఎందుకు ? ఏ ఉద్దేశంతో రాజేష్ ఈ పని చేసాడు అన్న అనుమానాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

కాగా రాజేష్ కి ఈరోజు కోర్టు అనుమతితో నపుంసక పరీక్షలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఆ టెస్ట్ రిసల్ట్ వచ్చాక శాడిస్టు భర్త పరిస్థితి ఇంకెలా ఉంటుందో చూడాలి మరి. కాగా ఉపాద్యాయ వృత్తి లో ఉండి ఇలాంటి పని చేసినందుకు రాజేష్ మీద ఆగ్రహం తో ఉన్నారు అందరూ.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Medical tests to Ruthless Husband Rajesh over Wedding Day Night Issue. and he came infront of media and Reveals everything, watch video to know more.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి