సదరం స్లాట్ బుకింగ్ కు అవకాశం- అమల్లోకి కొత్త నిబంధనలు..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా సదరం సర్టిఫికెట్ కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగులకు శుభవార్త చెప్పింది. సదరం స్లాట్ బుకింగ్ ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అక్టోబర్ 31 నుంచి స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించనున్నారు. దీంతో సదరం పరీక్షలు చేయించుకోవాలనుకునే దివ్యాంగులకు ఊరట లభించనుంది.
వైకల్య ధ్రువపత్రాల జారీకి అవసరమైన సదరం స్లాట్ బుకింగ్ ప్రక్రియను తుపాను ప్రభావం ముగిసిన తరువాత ప్రారంభిస్తామని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందినట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్‌లైన్ ద్వారా సుమారు 40వేల మంది దివ్యాంగులకు స్లాట్ల బుకింగ్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు తెలిపింది.

దివ్యాంగులకు వైకల్య ధ్రువీకరణ పత్రాలు జారీచేసే సదరం ప్రక్రియలో భాగంగా స్లాట్ బుకింగ్‌లను అక్టోబర్ 31వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. స్లాట్ బుకింగ్ ద్వారా దివ్యాంగులు తమకు కేటాయించిన తేదీల్లో వైద్య పరీక్షలకు హాజరుకావచ్చు.
ఈ ఏడాది ఇప్పటి వరకు 1.38లక్షల మందికి స్లాట్ బుకింగ్ సౌకర్యం కల్పించగా.. 1.28 లక్షల మంది వినియోగించుకున్నారు. వీరిలో 1.11 లక్షల మంది వైద్య పరీక్షలకు హాజరయ్యారు. ప్రస్తుత విధానంలో కాలపరిమితి లేకపోవడంతో పరీక్షలకు అలస్యంగా వెళ్తున్నారు. దీంతో కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఈ క్రమంలో స్లాట్ బుక్ చేసుకున్న వారు వైద్య పరీక్షలకు ఆరు నెలల్లోపు హాజరు కావాలనే నిబంధన విధించారు. హాజరుకాకపోతే ఆన్‌లైన్‌లో వారి వివరాలు తొలగిపోతాయి. ఇదిలాఉంటే.. వాట్సప్ మనమిత్ర, సచివాలయాలతో పాటు ఏపీ సేవా సిటిజన్ పోర్టల్ లోనూ స్లాట్ బుకింగ్ నమోదుకు అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
సదరం సర్టిఫికెట్ ఆధారంగా అర్హులైన దివ్యాంగులు ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రయోజనాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సదరం పరీక్షల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైతే వారికి ప్రయోజనం కలగనుంది.
సదరం స్లాట్ బుకింగ్‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్, అందుబాటులో ఉన్న తేదీలు, జిల్లాల వారీగా స్లాట్ల వివరాలను సంబంధిత ప్రభుత్వ అధికారిక ప్రకటన ద్వారా తెలుసుకోవాలి. బుకింగ్ ప్రారంభమైన తర్వాత సూచించిన విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ తేదీలు, వైద్య పరీక్షల వివరాలపై తాజా అధికారిక సమాచారాన్ని పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్లడం మంచిది. ఇదిలాఉంటే.. అర్హత సాధించని వారికి కొత్తగా మళ్లీ అప్పీల్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.














Click it and Unblock the Notifications
