నారా రోహిత్ పేరుతో భారీగా డబ్బు వసూలు, సాయికృష్ణ అరెస్ట్

విజయవాడ: ప్రముఖ సినీ హీరో నారా రోహిత్ అభిమానినంటూ పలువురి నుంచి డబ్బు వసూలు చేసిన కేసులో తాడికొండ సాయికృష్ణను విజయవాడ పోలీసులు బుధవారం నాడు అరెస్టు చేశారు. పలువురి నుంచి అతను లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని, సినిమా డిస్ట్రిబ్యూషన్ చేస్తానని చెప్తూ అతను డబ్బులు వసూలు చేశాడని ఫిర్యాదులు అందాయి. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తాను నారా రోహిత్ అభిమానినేనని, ఎవరి వద్ద డబ్బులు వసూలు చేయలేదని రెండు రోజుల కిందట సాయికృష్ణ మీడియాతో చెప్పాడు.

Sai Krishna arrested over illegal money collection

ఇదిలా ఉండగా, ఈ ఘటన పైన నారా రోహిత్ రెండు రోజుల క్రితం స్పందంచారు. తన పేరు చెప్పి డబ్బుల వసూళ్లకు పాల్పడిన సాయికృష్ణతో తనకెలాంటి సంబంధం లేదని నారా రోహిత్ స్పష్టం చేశారు.

తన సినిమాల పేరుతో సాయికృష్ణ విజయవాడలోని పలువురు వ్యక్తుల వద్ద పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డాడని, అతడిపై భవానీపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైందని సోమవారం ఉదయం మీడియాలో వార్తలు వచ్చాయి.

Sai Krishna arrested over illegal money collection

ఈ విషయంపై నారా రోహిత్ చాలా స్పందించారు. సాయికృష్ణ తనకు అభిమానిగానే తెలుసని స్పష్టం చేశారు. అయితే అతడు చేసిన అక్రమ వసూళ్లతో తనకెలాంటి సంబంధం లేని తేల్చి చెప్పాడు.

వివరాల్లోకి వెళితే టీఎన్ఎస్ఎఫ్‌కు చెందిన నేత సాయికృష్ణ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా నారా రోహిత్ సినిమాలను సాకుగా చూపి అతడు విజయవాడలోని పలువురి వ్యక్తుల వద్ద కోట్లాది రూపాయలు వసూళ్లు చేశాడు. అయితే గడువు ముగిసినా, అతడు రుణం చెల్లించకపోవడంతో రుణదాతలు అతడిని నిలదీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+