ప్రియ మిత్రుడికి, ఒక్క అవకాశమిస్తే: రజనీకాంత్ రాజకీయంపై మోహన్ బాబు, సాయి కుమార్
తిరుమల/హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రంపై రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. రజనీ సినిమాల్లో వెలుగొందినట్లే రాజకీయాల్లోను ఉచ్చస్థితికి చేరుకోవాలని చాలామంది ఆకాంక్షిస్తున్నారు.
ఆయనపై ఉన్న అభిమానంతో ఫ్యాన్స్, కొందరు ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుండవచ్చు. రజనీకాంత్ లాంటి మంచి వ్యక్తి సీఎం అయితే ప్రజలకు ఎంతో సేవ చేస్తారని అభిమానులతో పాటు చాలామంది భావిస్తున్నారు. దశాబ్దాలుగా ఆయన రాజకీయ ఆరంగేట్రంపై ఎదురు చూశారు. ఇప్పుడు ఆ కల నెరవేరింది.

రజనీకాంత్‌కు అవకాశం ఇస్తే
ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు ఆయన రాజకీయ ఆరంగేట్రంపై స్పందిస్తున్నారు. సినీ నటుడు సాయి కుమార్ సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రజనీకి అవకాశం ఇస్తే ప్రజలకు మంచి చేస్తారన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు.

అభిమానులకు రజనీపై నమ్మకం
అభిమానులకు ఆయన పైన అపారమైన నమ్మకం ఉందని సాయి కుమార్ చెప్పారు. కలియుగ వైకుంఠనాథుడు తిరుమల శ్రీవారు, చిలుకూరు బాలాజీ అవతారాలు ఎలా ఉద్భవించాయన్న కథతో నిర్మిస్తున్న చిత్రంలో తాను ప్రముఖ పాత్ర పోషించానని, ఆ సినిమా త్వరలో విడుదల కానుందని చెప్పారు.

ఆ నమ్మకం నాకు ఉంది
నా ప్రియమైన స్నేహితుడు రజనీకాంత్‌కి ఆల్ ది బెస్ట్ అని విలక్షణ నటుడు మోహన్ బాబు అన్నారు. సమాజానికి కావాల్సిన మార్పు ఆయన నాయకత్వం ద్వారా వస్తుందనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. తెలుగు వారితో పాటు పలువురు ఇతర ప్రమఖులు కూడా స్పందించారు.

2017 న్యూస్ ఆఫ్ ది ఇయర్
తన ప్రియమైన స్నేహితుడు, సహ నటుడు, అద్భుతమైన వ్యక్తి అయిన రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారని, ఈ రంగంలో ఆయన విజయం సాధించాలని కోరుకుంటున్నానని అమితాబ్ బచ్చన్, సంఘటిత ప్రజాస్వామ్యం, అభివృద్ధిపై రజనీకాంత్‌కు నమ్మకం ఉందని మనకు తెలుసునని, ఆయన రాజకీయాల్లో విజయం సాధించాలని ఆశిస్తున్నానని ఖుష్బూ, థ్యాంక్యూ లీడర్.. మీరు రాజకీయాల్లోకి రావాలన్న మా అందరి కల ఇంకా గుర్తుందని, మంచి చేద్దాం, మంచి గురించే మాట్లాడదామని, అప్పుడే మంచి జరుగుతుందని, లీడర్ అభిమానులు అందరికీ శుభాకాంక్షలని రాఘవ లారెన్స్ పేర్కొన్నారు. 2017లో న్యూస్ ఆఫ్ ది ఇయర్ ఇదేనని, రజనీ రాజకీయాల్లోకి వస్తున్నారని, జయహో అని అనుపమ్ ఖేర్ అన్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications